- Telugu News Photo Gallery Mysterious Forests Strange Stories of Mysterious Forests in the World Know the details
Mysterious Forests: ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన 5 అడవులు.. వీటి స్టోరీ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు..
రమణీయమైన ప్రకృతిని, అడవి అందాలను చూసి పులకరించిపోయేవారు, తన్మయం చెందేవారు చాలా మందే ఉంటారు. అయితే, దట్టమైన అడవుల్లోకి వెళ్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దూరం నుంచి వీక్షించినంతసేపు కళ్లకు ఆనందంగానే ఉంటుంది. కానీ, అందులోకి ఎంటరైతేనే పిక్చర్ కనిపిస్తుంది.
Updated on: Oct 16, 2022 | 2:13 PM

మొక్కలు, చెట్లు, అడవి, ప్రకృతిని ఇష్టపడని వారు ఈ భూమిపై ఉండరు గాక ఉండరు. రమణీయమైన ప్రకృతిని, అడవి అందాలను చూసి పులకరించిపోయేవారు, తన్మయం చెందేవారు చాలా మందే ఉంటారు. అయితే, దట్టమైన అడవుల్లోకి వెళ్తే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. దూరం నుంచి వీక్షించినంతసేపు కళ్లకు ఆనందంగానే ఉంటుంది. కానీ, అందులోకి ఎంటరైతేనే పిక్చర్ కనిపిస్తుంది. కొన్ని అడవులు అత్యంత భయానకంగా ఉంటాయి. అలాంటి అడవులు ప్రపంచలో చాలా ఉన్నాయి. అంతేకాదు, ఆ అడవులు ఎన్నో రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. అందుకే వాటిని వింత, రహస్య అడవులు అంటారు. ఇవాళ మనం ఆ రహస్య అడవుల గురించే తెలుసుకోబోతున్నాం..

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ పెద్ద అడవి ఉంది. దానిని కామెరాన్ పార్క్ అని పిలుస్తారు. కానీ, అక్కడి ప్రజలు మాత్రం దానిని పారానార్మల్ జోన్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే అక్కడ అసాధారణ ఘటనలు చోటు చేసుకుంటాయి. అందుకే ఆ పార్క్‌లోకి వెళ్లాలంటే జడుసుకుంటారు అక్కడి జనాలు. అక్కడో ఏదో రహస్యం ఉందని భావిస్తారు.

అమెరికాలోని మరో స్టేట్ నార్త్ కరోలినాలోనూ ఓ వింత అడవి ఉంది. డెవిల్ ట్రాంపింగ్ గ్రౌండ్ అని దానిని పిలుస్తారు. ఆ అడవిలో ప్రతి రాత్రి దెయ్యాలు సంచరిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే అక్కడ చెట్లు, మొక్కలు పెరుగవని అంటున్నారు అక్కడి జనాలు. అంతేకాదు.. దెయ్యాల కారణంగానే ఒక్క జీవి కూడా మనుగడ సాగించదట.

మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో గల డార్జిలింగ్‌లో డౌ హిల్ అనే అడవి ఉంది. ఈ అడవి కూడా రహస్యాలకు నెలవు అని చెబుతారు. ప్రతి రాత్రి ఈ అడవిలో దెయ్యాలు తిరుగుతాయని అంటుంటారు. ఆ దెయ్యాల సంచారం భయంతోనే జనాలు రాత్రిపూట అక్కడికి వెళ్లాలంటే జడుసుకుంటారు.

యూరప్‌లోని రొమేనియాలో కూడా ఓ వింత, భయానకమైన అడవి ఉంది. హోయా-బస్యు అనే అడవి ఉంది. దీనిని ట్రాన్సిల్వేనియా ‘బెర్ముడా ట్రయాంగిల్’ అని కూడా పిలుస్తారు. ఈ అడవిలో చాలా మంది అదృశ్యమయ్యారని చెబుతారు. ఆ అడవిలో దెయ్యాలు ఉన్నాయని, ఆ కారణంగా మనుషులు మాయం అవుతున్నారని అక్కడి జనాల విశ్వాసం. అందుకే.. ఆ అడవిలోకి వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు.

జర్మనీలో ఉన్న ఈ అడవిని బ్లాక్ జంగిల్ అంటారు. ఆ అడవిలో తల లేని ఓ దెయ్యం తెల్లని గుర్రంపై స్వారీ చేస్తుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన అడవుల్లో ఒకటిగా నిలిచింది. దట్టమైన ఈ అడవిలోకి వెళ్లాలంటే జనాలు జడుసుకుంటారు.





























