AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: దుబాయ్‌లో అంబానీకి మరో విల్లా.. ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ..తన రికార్డును తానే బ్రేక్‌ చేశారు. ఇటీవల దుబాయ్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ఈ బిలియనీర్‌..లేటెస్ట్‌గా మరో బీచ్‌ సైడ్‌ ..

Mukesh Ambani: దుబాయ్‌లో అంబానీకి మరో విల్లా.. ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Mukesh Ambani
Shiva Prajapati
|

Updated on: Oct 19, 2022 | 10:26 PM

Share

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ..తన రికార్డును తానే బ్రేక్‌ చేశారు. ఇటీవల దుబాయ్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ఈ బిలియనీర్‌..లేటెస్ట్‌గా మరో బీచ్‌ సైడ్‌ విల్లాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్‌లోని పామ్‌ జుమైరాలో ఉన్న లగ్జరీయస్‌ విల్లాను తన చిన్నా కుమారుడు అనంత్‌ అంబానీ కోసం కొనుగోలు చేసినట్టు సమాచారం. సుమారు 163 మిలియన్‌ డాలర్ల విలువైన..అంటే రూ.1353 కోట్లు వెచ్చించి ఈ విల్లాను కొన్నట్టు తెలుస్తోంది. చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్‌ జుమైరా.. దుబాయిలో కృతిమంగా ఏర్పాటుచేసిన దీవుల సముదాయం. కువైట్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబానికి చెందిన విల్లానే..అంబానీ తన సొంతం చేసుకున్నట్లు సమాచారం.

గతవారంలో 163 మిలియన్‌ డాలర్ల ప్రాపర్టీ డీల్‌ జరిగినట్టు రికార్డ్‌ చేసిన దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌..ఎవరు కొనుగోలు చేశారో మాత్రం వెల్లడించలేదు. తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించే యోచనలో ఉన్న అంబానీ ఇటీవల విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. గత నెలలో 640 కోట్లకు పైగా విలువజేసే బిల్డింగ్‌ కొనుగోలు చేసిన అంబానీ..దాన్ని పెద్ద కుమారుడు ఆకాశ్‌కు కేటాయించినట్టు సమాచారం. 79 మిలియన్ల డాలర్లతో ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్‌ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. అలాగే కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్‌లో కూడా ఖరీదైన భవనం కోసం వెతుకుతున్నారని..అలాగే సింగపూర్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ ఏర్పాటులో బిజీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..