WhatsApp: వాట్సాప్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఏం కాదులే అనుకున్నారో రిజల్ట్ ఇలా ఉంటది..
ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ను వినియోగించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా నానాటికి పెరుగుతోంది. సులువుగా, ఫాస్ట్‌గా మెసేజ్ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటు కలిగిన ఈ యాప్‌ను..
ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ను వినియోగించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా నానాటికి పెరుగుతోంది. సులువుగా, ఫాస్ట్‌గా మెసేజ్ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటు కలిగిన ఈ యాప్‌ను మిలియన్ల మంది వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్న నేపథ్యంలో.. వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీ, ప్లాట్‌ఫామ్ దుర్వినియోగం అవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది వాట్సాప్ యాజమాన్యం. ఈ క్రమంలోనే యాప్‌ను దుర్వినియోగం చేసే అకౌంట్స్‌ని ప్రతి నెలా బ్లాక్ చేస్తోంది వాట్సాప్. అధికారిక సమాచారం ప్రకారం.. వాట్సాప్ రూల్స్ పాటించనందుకు చాలా అకౌంట్స్ బ్లాక్ చేయడం జరిగింది. ఆగస్టు నెలలో కంపెనీ 2.3 మిలియన్ల ఖాతాలను బ్లాక్ చేసింది. దీనికి అనేక కారణాలను చూపింది వాట్సాప్. మరి ఎలాంటి పనులు చేస్తే వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫార్వర్డ్ మెసేజ్‌లు..
వాట్సాప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు ఎక్కువ అవడంతో.. అన్ని ఫార్వార్డ్ మెసేజ్‌ల కోసం ఒక లేబుల్‌ను రూపొందించింది. దీని కారణంగా ఆ సందేశంపై ఎలాంటి సందేహం ఉన్నా.. అది ఫార్వర్డ్ మెసేజ్ అని లేబుల్ చేయబడి ఉంటే దానిని షేర్ చేయకుండా ఉండొచ్చు. అలా కాకుండా.. తప్పుడు సందేశాన్ని పదే పదే ఫార్వర్డ్ చేసినట్లయితే.. వాట్సాప్ మీ అకౌంట్‌ను బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది.
బల్క్ మెసేజ్‌లు..
ఒకేసారి వరుసగా, పెద్ద పెద్ద మెసేజ్‌లు పంపడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తుంది వాట్సాప్. మెషిన్, యూజర్ రిపోర్ట్ లెర్నింగ్ ద్వారా ఆటోమేటెడ్ సందేశాలను పంపేవారిని వాట్సాప్ నిషేధిస్తుంది. అందుకే ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్ దుర్వినియోగం..
బ్రాడ్‌కాస్టింగ్ నుంచి పంపిన మెసేజ్‌లు మీ నంబర్ సేవ్ చేసినప్పుడు మాత్రమే రిసీవర్ ద్వారా స్వీకరించడం జరుగుతుంది. దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే వాట్యాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది.
వ్యక్తి అనుమతి లేకుండా గ్రూప్‌లో నెంబర్ యాడ్ చేయడం..
ఏదైనా గ్రూప్‌లో ఎవరినైనా యాడ్ చేసుకునే ముందు వారి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. వారి అనుమతి తీసుకోకుండా చాలా మందిని వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకుంటారు. అలా చేయడం పెద్ద తప్పు. ఒకవేళ సదరు వ్యక్తి రిపోర్ట్ చేస్తే.. ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది.
తెలియని నంబర్‌కు మెసేజ్ పంపొద్దు..
యాప్ వినియోగదారులు తమకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే వాట్సాప్‌తో కనెక్ట్ అవ్వాలని, తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు పంపితే మాత్రం అకౌంట్ బ్లాక్ అవడం ఖాయం.
షరతులు అంగీకరించపోతే..
వాట్సాప్ నిబంధనలు, షరతులను వినియోగదారుడు తప్పక అంగీకరించాలి. లేదంటే కంపెనీ వెంటనే ఆ అకౌంట్‌ను బ్లాక్ చేస్తుంది. అంటే.. వాట్సాప్ యూజర్ ఎలాంటి పుకార్లు, తప్పుడు, అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన సందేశాన్ని పంపించకూడదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..