Motorola edge 30 ultra: భారత మార్కెట్లోకి మోటరోలా నుంచి మరో కొత్త ఫోన్.. కెమెరా క్లారిటీ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటరోలా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గత కొన్ని రోజులుగా వరుసగా లో బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తున్న మోటరాలో తాజాగా ప్రీమియం ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో పలు...
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటరోలా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గత కొన్ని రోజులుగా వరుసగా లో బడ్జెట్ ఫోన్‌లను తీసుకొస్తున్న మోటరాలో తాజాగా ప్రీమియం ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో పలు ఆకర్షణీయ ఫీచర్లను అందించారు. ఈ ఫోన్ ధర ఎంత ఉంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
మోటరోలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచెస్ ఫుల్‌హెడ్‌డీ+ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1500 నిట్స్‌తో ఈ డిస్‌ప్లే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 ప్రాసెసర్‌ను అందించారు. ఇక బ్యాటరీకి ఇందులో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. 125 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4610 ఎమ్‌ఏహెచ్ వంటి అంత్యంత పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు.
ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర రూ. 65,000గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 56,999కే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఎస్‌బీఐ కార్డ్‌తో కొనుగోలు చేసే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను సైతం అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..