- Telugu News Photo Gallery Technology photos Asus launches foldable laptop Asus Zenbook 17 Fold features and price Telugu Tech news
Asus Zenbook 17 Fold: ఆసుస్ నుంచి స్టన్నింగ్ ల్యాప్‌టాప్.. ధర రూ. 3 లక్షలకుపైమాటే.. అంతలా ఏముందనేగా..
ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ ఆసుస్ సరికొత్త ఆవిష్కరణకు తెర తీసింది. ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 3 లక్షల ధరతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి..
Updated on: Oct 19, 2022 | 6:45 AM

ఆసుస్ జెన్‌బుకల్ 17 ఫోల్డ్ ఓఎల్‌ఈడీ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మడతపెట్టే మొదటి ల్యాప్‌టాప్ ఇదేనని ఆసుస్ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్‌లో 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్‌ప్లే ఇస్తున్నారు. దీన్ని మడబెట్టినప్పుడు 12.5 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. మిగిలిన స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డుగా వాడుకోవచ్చు.

ఈ ల్యాప్‌టాప్‌ను యూజర్లను అవసరానికి అనుగుణంగా ట్యాబ్, డిస్‌ప్లేలా రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇందులో 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 5 మెగాపిక్సెల్ కెమెరా, డాల్బీ ఆటామస్‌తో కూడిన నాలుగు స్పీకర్స్ దీని ప్రత్యేకత.

ఈ ల్యాప్‌టాప్‌లో 500 జీబీ ఎస్‌ఎస్‌డీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌ను ఉచితంగా అందించారు. ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ఈ గ్రాఫిక్ కార్డ్ ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకగా చెప్పొచ్చు.

ఇక ఆసుస్ జెన్‌బుక్ 17 ఫోల్డ్ ల్యాప్‌టాప్‌లో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్‌టెండెడ్ అని ఐదు స్క్రీన్ మోడ్స్‌ను అందించారు.

ధర విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 3,29,000గా ఉంది. లాంచింగ్ ఆఫర్ కింద రూ. 2,84,290కే అందిస్తారు. అయితే ఈ ఆఫర్ నవంబర్ 10వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.




