- Telugu News Photo Gallery Technology photos Motorola launches new smartphone moto e22s features and price details Telugu Tech News
Moto e22s: మోటరోలా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. రూ. 10 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..
కెమెరా విషయానికొస్తే ఇందులో 16 రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే ఇందులో 10 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.
Updated on: Oct 18, 2022 | 10:28 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ నెల 22 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. మోటో ఈ22ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

మోటో ఈ 22 ఫోన్ ధర రూ. 8,999లకు లభిస్తుంది. 4జీబీ రామ్ ప్లస్ 64జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 90హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 ఎంపీ ఏఐ కెమెరా, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

4 జీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్ సామర్థ్యం. ఇందులో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ పానెల్ విత్ 1600×720 రిజొల్యూషన్ సామర్థ్యం గల డిస్‌ప్లేను అందించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 16 రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. అలాగే ఇందులో 10 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు.




