Uterine Cancer: హెయిర్‌ స్ట్రెయిటెనింగ్ వినియోగిస్తున్నారా? షాకింగ్ న్యూస్ మీకోసమే..

మహిళలు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

Uterine Cancer: హెయిర్‌ స్ట్రెయిటెనింగ్ వినియోగిస్తున్నారా? షాకింగ్ న్యూస్ మీకోసమే..
Hair Straightener
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 19, 2022 | 8:33 PM

మహిళలు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క అమెరికాలోనే దాదాపు 70 వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా అధ్యయనం ప్రకారం.. ప్రజలు రోజూ వినియోగించే కొన్ని రకాల కాస్మోటిక్స్ క్యాన్సర్‌కు కారణం అవుతున్నాయట. జుట్టు సంరక్షణ కోసం వివిధ రసాయనాలను ప్రజలు వినియోగించడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్ కోసం ఉపయోగించే పరికరాలు ప్రాణాంతక వ్యాధి బారిన పడేలా చేస్తున్నాయట.

నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జర్నల్‌లో పేర్కొన్న కొత్త అధ్యయనం ప్రకారం.. అమెరికాలోని విభిన్న జాతుల జనాభాలో చాలా మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఇందుకు జుట్టుకు ఉపయోగించే ఉత్పత్తులు కూడా ఒక విధంగా కారణం అవుతున్నాయని విశ్లేషించింది. రసాయనాల వినియోగం, హెయిర్ స్ట్రెయిటెనింగ్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల అసమతుల్యత గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా అమెరికాలోని 35 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సుల మహిళలపై పరిశోధన జరిపారు. తాత్కాలిక, సెమీ-పర్మనెంట్, శాశ్వత హెయిర్ డైలు, హైలైట్‌లు, బ్లీచ్, రిలాక్సర్స్, స్ట్రెయిట్‌నెర్‌లు, ప్రెస్సింగ్ ప్రోడక్ట్స్, బాడీ వేవ్‌లు వంటి హెయిర్ ట్రీట్‌మెంట్ ఉపకరణాలతో సహా 7 హెయిర్ ప్రోడక్ట్‌ల వ్యక్తిగత వినియోగం ఫ్రీక్వెన్సీ సమాచారం సేకరించారు. వీరిలో కొందరు గర్భాశయ క్యాన్సర్ బారిన పడినట్లు గుర్తించారు. ఎండోమెట్రియల్ క్యాన్సర్‌లుగా విభిజించారు. టైప్1, టైప్ 2 ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ను మరింత నిర్వచించారు.

ఇవి కూడా చదవండి

స్ట్రెయిట్‌నెర్‌లతోనే..

అయితే, స్ట్రెయిట్‌నెర్‌లను అతిగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అదే సమయంలో ఇతర జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అవలేదు. అదే సమయంలో రుతుక్రమం ఆగిపోయిన, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కేసులు, వైద్యపరంగా ధృవీకరించబడిన గర్భాశయ క్యాన్సర్ కేసులకు సమానంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక శారీరక శ్రమ ఎక్కువగా లేని స్త్రీలు, శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారి కంటే స్ట్రెయిట్‌నెర్‌లను అధికంగా ఉపయోగించినట్లు పరిశోధకులు అబ్జర్వ్ చేశారు.

ఇంతకీ గర్భాశయ క్యాన్సర్ అంటే ఏంటి?

గర్భాశయ క్యాన్సర్‌లో రెండు రకాలు ఉంటాయి. ఎండోమెట్రియల్, యుటెరైన్ సార్కోమా. పరివర్తన చెందిన కణాలు పెరగడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వస్తుందని, ఇది ట్యూమర్‌ను ఏర్పరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు..

గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో కొన్ని, ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం. పీరియడ్స్‌లో లేనప్పుడు యోని నుంచి రక్తస్రావం అవడం, పోస్ట్ మెనోపాజ్ స్పాటింగ్, దిగువ పొత్తికడుపు నొప్పి లేదా పొత్తికడుపులో తిమ్మిరి, సన్నని తెలుపు, స్పష్టమైన యోని ఉత్సర్గ, తరచుగా యోని రక్తస్రావం అవడం జరుగుతంది.

గమనిక: ఇందులోని సమాచారం శాస్త్రవేత్తలు వెల్లడించిన అధ్యయనం ప్రకారం పేర్కొనడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృ‌వీకరించడం లేదు. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..