AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. తొలి స్నానం ఆచరించేది ఎవరో తెలుసా..!

సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది.. కాళేశ్వరం త్రివేణ సంగమ తీరం ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ ను తలపిస్తుంది.. రేపు ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి..

సరస్వతి అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం.. తొలి స్నానం ఆచరించేది ఎవరో తెలుసా..!
Saraswati Antya Pushkarams
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: May 20, 2026 | 10:30 AM

Share

సరస్వతి అంత్య పుష్కరాలకు అంతా సిద్ధమైంది.. కాళేశ్వరం త్రివేణ సంగమ తీరం ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ ను తలపిస్తుంది.. రేపు ఉదయం 5.43 నిమిషాలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి.. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిరోజు పుష్కర స్నానం ఆచరిస్తారు.. 12 రోజుల పాటు జరిగే అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

సరస్వతి అంత్య పుష్కరాలకు సమయం సమయం ఆసనమైంది.. మే నెల 21 నుండి జూన్ 01 వరకు 12 రోజుల పాటు జరుగనున్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం కాలేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుతుంది.. ప్రయాగరాజును తలపిస్తుంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

గత ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి.. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుండి సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు.. అంత్య పుష్కరాల సందర్భంగా జ్ఞానసరస్వతి పుష్కర ఘాట్, VIP ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు.. సౌండ్స్ అండ్ లైటింగ్, ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు.. VIP భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు.. 21వ తేదీ ఉదయం 5.43 నిమిషాలకు పుష్కరాలు ఆరంభమవుతాయి.. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరిస్తారు..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తొలిరోజు పుష్కర స్నానం ఆచరిస్తారు.. గవర్నర్ పర్యటన సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.. అంత్య పుష్కరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండడంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్న అదికార యంత్రాంగం.. నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు..

అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుండి స్వామిజీలు, పీఠాదిపతులు రానున్నారు.. ప్రత్యేక హోమాలు ఉంటాయి.. మొదటిరోజు 21వ తేదీ గురువారం రోజున మహా గణపతి హోమం ఉంటుంది..22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరీ హోమం, 23వ తేదీన హయగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహా మృత్యుజయ హోమం, 26వ తేదీన దుర్గా సూక్త హోమం, 27వ తేదీన మహా సుదర్శన హోమం, 28వేద దక్షిణామూర్తి హోమం, 29వ తేదీన స్వయంవర పార్వతి హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31వ మహారుద్ర హోమం, 01వ తేదీన లఘు చండీ మహా పూర్ణాహుతి ఉంటుంది..

సరస్వతి అంత్య పుష్కరాలకు తెలంగాణ RTC రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుండి 3,360 బస్సు సర్వీసులు నడుపుతుంది. 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us