AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..?

కొన్ని దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. అవును.. జంతువుల కొవ్వు నుంచి తయారుచేసిన టాల్లో అనే పదార్ధాన్ని వినియోగిస్తున్నారు. నోట్లు అంటుకోకుండా ఉండేందకు ఇది సహాయపడుతుంది. దీనిపై అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. అయినా ఇప్పటికీ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడో మీకు తెలుసా..

Currency Notes: కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారో తెలుసా..?
Currency Notes
Venkatrao Lella
|

Updated on: Sep 02, 2026 | 9:39 PM

Share

కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది నిజమే. కానీ భారత్‌లో కాదండోయ్.. విదేశాల్లోని కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగిస్తున్నారు. బ్రిటన్‌తో పాటు పాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, న్యూజిలాండ్, కెనడా, మలేషియా, సింగపూర్ దేశాల కరెన్సీలో జంతువుల కొవ్వును వాడుతున్నారు. ఈ దేశాల్లో పాలిమర్ నోట్లను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే టాల్లోను నేరుగా ఉపయోగించకుండా.. దాని నుంచి తీసిన రసాయనాలను వాడుతున్నారు.

ఎందుకు వాడతారంటే..?

నోట్లు బ్యాంక్ నోట్ షీట్‌కు అంటుకోకుండా టాల్లో నుంచి తీసిన రసాయనం ఉపయోగపడుతుంది. ఇక ప్రింటింగ్, కటింగ్ సమయంలో కూడా అంటుకోకుండా ఇది సహాయపడుతుంది. దీని వల్ల నోట్ల ఉత్పత్తి మరింత వేగంగా, సజావుగా జరుగుతుంది. ఘర్షణను తగ్గించి యంత్రం గుండా పదార్థం ప్రవాహాన్ని ఇది పెరుగుపరుస్తుంది. అందుకే కరెన్సీ నోట్ల తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసిన టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగిస్తున్నారు. 2016లో బ్రిటన్‌లో కొత్తగా 5,10 పౌండ్ల పాలిమర్ నోట్లను విడుదల చేశారు. ఇందులో టాల్లో అనే పదార్ధాన్ని ఉపయోగించినట్లు తేలింది. దీంతో హిందూ, సిక్కు సంఘాలతో పాటు శాకాహార సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. వివాదం చెలరేగడంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ స్పందించింది. ముందుగా ఈ విషయం తమకు తెలియదని సమర్ధించున్న బ్యాంక్.. ఆ తర్వాత జంతువులు కొవ్వు అనవాళ్లు ఉన్నాయని అంగీకరించింది. అయితే పామాయిల్ వాడటం పర్యావరణానికి హానికరమమే ఉద్దేశంతో జంతువుల కొవ్వు వాడటం కొనసాగించాలని నిర్ణయించింది.

భారత్‌లో త్వరలో పాలిమర్ నోట్లు..

అయితే భారత్‌లో కూడా త్వరలో పాలిమర్ నోట్లు రానున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇవ్వడంతో ఆర్బీఐ నోట్లను తీసుకొచ్చే ప్రణాళికలు రచిస్తోంది. ఇతర దేశాల్లో నోట్లపై వివాదాలు రావడంతో భారత్‌లో తయారుచేసే పాలిమర్ నోట్లకు జంతువుల కొవ్వు వాడకూడదని నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలిమర్ షీట్ల విషయంలో ఇతర దేశాల్లో వివాదాలు రావడంతో భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. తొలుత రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ భావిస్తోంది. పాలిమర్ షీట్ల కొనుగోలు కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్ల కంటే పాలిమర్ నోట్లు అత్యంత మన్నిక కలిగి ఉంటాయి. తేమకు చినిగిపోయే అవకాశం ఉండదు. ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లను కూడా ఇందులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో నకిలీ నోట్ల సృష్టించడానికి కూడా కుదరదని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో పాలిమర్ నోట్లను విడుదల చేసేందుకు ఆర్బీఐ సిద్దమవుతోంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..