AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO GSLV-F17 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నింగిలోకి EOS-05

ISRO GSLV-F17 launch: శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఈ ప్రయోగం ద్వారా 2,367 కిలోల బరువున్న EOS-05 భూ పరిశీలనా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. రక్షణ, మత్స్య సంపద గుర్తింపు, వాతావరణ పరిశీలనలో ఈ ఉపగ్రహం కీలకంగా ఉపయోగపడనుంది.

ISRO GSLV-F17 ప్రయోగానికి కౌంట్‌డౌన్.. సెప్టెంబర్ 4న తెల్లవారుజామున నింగిలోకి EOS-05
Isro Gslv F17 Launch
Ch Murali
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 9:49 PM

Share

ISRO GSLV-F17 launch: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా సతీష్ దావన్ స్పేస్ సెంటర్ షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సెప్టెంబర్ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు GSLV-F17 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిపేందుకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి MMR మీటింగ్ ఈ ఉదయం షార్‌లో జరిగింది. GSLV-F17 రాకెట్ ప్రయోగం ద్వారా 2367 కేజీలు బరువు కలిగిన Eos -05 అనే (earth observation శాటిలైట్) భూ పరిశీలనా ఉపగ్రహంను 28 ,934 వేల కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశించిన భూ బదిలీ కక్ష (GTO)జియో transfer orbitలోకి ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం విజయవంతం అయితే భారత దేశ రక్షణ వ్యవస్థ కు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

అంతే కాకుండా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే సమయంలో మత్స్య సంపద ఎక్కడ ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఈ ఉపగ్రహం ద్వారా గుర్తించవచ్చు, దేశ సరిహద్దు ప్రాంతాలలో శత్రు దేశాల కదలికలను గట్టి నిఘాతో రక్షణ వ్యవస్థకు సమాచారం అందిస్తుంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే సమయంలో ముందుగా వచ్చే విపత్తులను గుర్తించి ముందస్తు జాగ్రత్తల కోసం సమాచారం శాస్త్రవేత్తలకు అందిస్తుంది. ఈ రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే షార్‌లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసుకుని శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ వద్ద రాకెట్ ప్రయోగ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు.

ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియను కూడా 27 గంటల ముందు శాస్త్రవేత్తలు ప్రారంభించనున్నారు. ఈ రాకెట్ ప్రయోగం ను మూడు దశల తో జరుపనున్నారు. వాతావరణం గనుక సానుకూలంగా స్పందిస్తే శాస్త్రవేత్తలు అనుకున్న సమయానికి అనగా ఈ నెల 4 వ తారీకున తెల్లవారుజామున రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు GSLV-F17 రాకెట్ ప్రయోగంను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో సిద్ధంగా ఉంది. ప్రయోగం విజయవంతం కోసం ఇస్రో చైర్మన్ నారాయణన్ శాస్త్రవేత్తల బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అలాగే సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Follow Us
కీలక ప్రయోగానికి ఇస్రో కౌంట్ డౌన్..
కీలక ప్రయోగానికి ఇస్రో కౌంట్ డౌన్..
అయ్యో.. సోఫాపై టీ ఒలికిందా? ఈ చిట్కాతో మరక మాయం!
అయ్యో.. సోఫాపై టీ ఒలికిందా? ఈ చిట్కాతో మరక మాయం!
కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారంటే..?
కరెన్సీ నోట్లలో జంతువుల కొవ్వు.. ఏ దేశంలో ఉపయోగిస్తున్నారంటే..?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరు?
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి!
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు?..
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
పికిల్‌బాల్ వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
శ్రీకృష్ణునికి ఇష్టమైనవి ఇవే.. జన్మాష్టమికి ఈ వస్తువులను ఇంటికి..
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు జబర్దస్త్‌ లో బాగా ఫేమస్..గుర్తు పట్టారా?
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం
బాబా వంగా జ్యోస్యం.. 2026 చివరి నాటికి వీరికి తల రాత మారడం ఖాయం