నేపాల్ వరదల్లో తల్లిదండ్రులు వెంకట్ రామ్ అన్నం దేవర, అనఘా గల్లంతు కావడంతో, నీట్ అభ్యర్థి తన్వి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే, కన్నవారి ఆశలను నెరవేర్చాలనే సంకల్పంతో కన్నీళ్లతోనే నీట్ పీజీ పరీక్ష రాసింది. వారి భవిష్యత్తు కలల కోసమే పరీక్ష రాశానని, వారు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.