AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

నేపాల్‌ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు.. యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తున్న శునకం

Phani CH
|

Updated on: Sep 02, 2026 | 6:45 PM

Share

నేపాల్‌లో భారీ వరదలు ఇళ్లను, కుటుంబాలను ఛిద్రం చేసిన వేళ ఓ శునకం చూపిస్తున్న విశ్వాసం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నువాకోట్ జిల్లా త్రిశూలి బజార్‌లో ఇల్లు కొట్టుకుపోయినా, మెడపట్టీతో ఉన్న నలుపు-తెలుపు కుక్క మాత్రం అక్కడి బురదలోనే కూర్చుని తన యజమాని కుటుంబం కోసం ఎదురుచూస్తోంది. ఆహారం, నీటిని కూడా తొలుత పట్టించుకోకుండా కదలకుండా ఉండటంతో స్థానికులు చలించిపోతున్నారు.

భారీ వరదలతో నేపాల్‌ అతలాకుతలమైంది. వదర తాకిడికి ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. వందలమంది మృత్యువాత పడ్డారు.. వేలాదిమంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో వరద బీభత్సంనుంచి ఎలా బయటపడితో కానీ ఓ శునకం తన యజమాని కుటుంబం కోసం ఆ ఇంటి ప్రాంతంలో బురదలోనే కూర్చుని రెప్పవేయకుండా ఎదురుచూస్తోంది. ఆ మూగజీవి నిరీక్షణ చూసి స్థానికులు చలించిపోతున్నారు. ఆహారం కూడా తీసుకోకుండా దీనంగా ఎదురు చూస్తోంది. అక్కడినుంచి క్షణం అక్కడినుంచి తప్పుకున్నా తన యజమాని వస్తే మిస్‌ అయిపోతానన్నట్టుగా అక్కడినుంచి కదలడంలేదు. ఆ మూగజీవి ఆవేదన అక్కడివారిని కంటతడి పెట్టిస్తోంది. వేలాదిమంది ప్రాణాలను హరించిన పెను ప్రళయం తన యజమాని ఆవాసాన్ని తుడిచిపెట్టేసినా, ఆ కుక్క మాత్రం తన కుటుంబం తిరిగి వస్తుందన్న నమ్మకంతో అదే బురద ప్రాంతంలో కాపలాగా ఉంటోంది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి బజార్‌లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కదిలిస్తోంది. గత వారం సంభవించిన భారీ వరదలకు త్రిశూలి బజార్‌లో నాలుగు ఇళ్ల వరుస పూర్తిగా కొట్టుకుపోయింది. అక్కడ ఇప్పుడు కేవలం బురద, శిథిలాలు మాత్రమే మిగిలాయి. కానీ, ఆ శిథిలాల మధ్య మెడపట్టీతో ఉన్న ఒక నలుపు-తెలుపు కుక్క మాత్రం ఆ ప్రాంతం విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తోంది. చుట్టూ అరడజను జేసీబీలు గర్జించినా, సహాయక సిబ్బంది పనులు చేస్తున్నా అది ఏమాత్రం చలించడం లేదు. అపరిచితులు బిస్కెట్లు ఇచ్చి బుజ్జగించినా తినకుండా, ఒక్కసారి కూడా తోక ఊపకుండా, ఒకే చోటనే కూర్చుంటోంది. అది ఏ ఇంటికి చెందిందో, దాని యజమానులు ఎవరనేది ఎవరికీ తెలియదు. అయినప్పటికీ, తన పరిధి దాటి వెళ్లేందుకు అది ఇష్టపడడం లేదు. దాని దీనస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు, వాలంటీర్లు చివరికి బలవంతంగా పంపడం మానేసి, సమీపంలోనే పొడి ఆహారం, మంచి నీరు ఉంచుతున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా మారినప్పుడు మాత్రమే అది వచ్చి ఆహారం తింటోంది. “అందరూ ఎందుకు అదృశ్యమయ్యారో అర్థం కాక ఆ శునకం తనవాళ్లకోసం ఎదురుచూస్తున్న తీరు అందరినీ కదిలిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే ఒక్క పాట.. 5 కోట్ల వ్యూస్‌.. చివరికి సింగర్‌ ప్రాణాన్ని తీసేసింది ఇలా!

Follow Us