బెంగళూరులో ఓ 33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి డేటింగ్ యాప్ మోసానికి గురయ్యాడు. యాప్ ద్వారా పరిచయమైన మహిళ కలుద్దామని చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ నలుగురు వ్యక్తులు బెదిరించి, అతని వద్ద నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, నగదు కలిపి దాదాపు ₹3.5 లక్షలు దోచుకున్నారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు కొనసాగుతోంది.