AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరో తెలుసా? కప్పు కొట్టకున్నా..

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ మరో 4 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 6)న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నదెవరో తెలుసా? కప్పు కొట్టకున్నా..
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Sep 02, 2026 | 9:43 PM

Share

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్‌ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం గ్రాండ్ గా ముస్తాబయ్యింది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి షోలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని తెలుస్తోంది. గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని టాక్ . అలాగే ఆడియెన్స్ కు డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేలా ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేశారట. మరోవైపు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు, బుల్లితెర సెలబ్రిటీలు ఈసారి హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం నిర్వాహకులు భారీగానే ఏర్పాట్లు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్న క్రమంలో.. గత సీజన్‌లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఎవరా? అని ఆడియెన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ యాంకర్ శ్రీముఖి అని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన ఈ బుల్లితెర రాములమ్మ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకుంది. చివరి వరకు ఆమెనే విన్నర్ అని ఫిక్స్ అయ్యారు ఆడియెన్స్. అయితే త్రుటిలో బిగ్ బాస్ కప్పు మిస్ అయ్యింది శ్రీముఖి. మూడో సీజన్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా, శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ సీజన్ లో విజేతగా నిలిచిన రాహుల్ సిప్లీగంజ్ కంటే శ్రీముఖినే ఎక్కువగా పారితోషికం తీసుకుందట. రాహుల్ 100 రోజులకు గానూ రూ. 20 లక్షల రెమ్యునరేషన్ తో పాటు విన్నర్ గా ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు. తీసుకున్నాడట. మొత్తంగా రూ. 70 లక్షలతో బయటకు వచ్చాడు రాహుల్. అయితే శ్రీముఖి మాత్రం కేవలం రెమ్యూనరేషనే రూ.80 లక్షలకు పైగా తీసుకుందని సమచారం. హౌజ్‌లో దాదాపు 100 రోజులు ఉన్న ఈ యాంకరమ్మ రోజుకు రూ.80 వేల వరకు రెమ్యునరేషన్ అందుకుందట. ఆ లెక్కన మొత్తం రూ. 80 లక్షలతో బయటకు వచ్చిందట. ఒక్క మూడో సీజన్ మాత్రమే కాదు.. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ శ్రీముఖినే అని తెలుస్తోంది.

శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us