AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మాధవన్ నటించిన ఈ బయోపిక్ మూవీ ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలైంది. మరీ సూపర్ హిట్ రేంజ్ కాకపోయినా కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే విమర్శకుల ప్రశంశసలు కూడా అందుకుంది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడం విశేషం.

OTT Movie: ఓటీటీలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
GDN Movie
Basha Shek
|

Updated on: Sep 02, 2026 | 6:46 AM

Share

చాక్లెట్ బాయ్ ఆర్. మాధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘జీడీఎన్’ (GDN). భారతీయ ప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జి.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కృష్ణకుమార్ రామకుమార్ రూపొందించిన ఈ బయోపిక్ లో టైటిల్ రోల్ లో మాధవన్ అద్భుతంగా నటించారు. ఆగస్టు 7 థియేటర్లలో విడుదలైన ఈ బయోపిక్ సినిమా కంటెంటప్ పరంగా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ కలెక్షన్లు సాధించలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వస్తోంది. జీడీఎన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ రియల్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఆగస్టు 04 నుంచి జీడీఎన్ సినిమా ఓటీటీలోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా జీడీఎన్ సినిమాను నిర్మించారు. మాధవన్ తో పాటు ప్రియమణి, దుషారా విజయన్‌లతో పాటు సీనియర్ యాక్టర్లు సత్యరాజ్, జయరామ్, వినయ్ రాయ్, అదితి బాలన్, కరుణాకరన్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ’96’ సినిమాతో మ్యూజిక్ మ్యాజిక్ చేసిన గోవింద్ వసంత ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం, బీజీఎమ్ అందించారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. పీరియాడికల్ బయోపిక్ డ్రామా గా జీడీఎన్ తెరకెక్కింది. బ్రిటీష్ కాలంలో దక్షిణ భారతదేశానికి చెందిన జీడీ నాయుడు స్వయంకృషితో ఎదిగిన తీరు, ఆయన చేసిన యాంత్రిక ఆవిష్కరణలు, ఎదుర్కొన్న సవాళ్లను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. మాధవన్ యాక్టింగ్ కోసమైనా ఈ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు. ఇక ఈ మధ్యన థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో భారీ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. కాబట్టి మాధవన్ జీడీఎన్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో మాధవన్ జీడీఎన్ సినిమా..

మాధవన్ జీడీఎన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ