AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: ఆ స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్నా.. ఏదో ఒక రోజు ఆయన రుణం తీర్చుకుంటా: బండ్ల గణేష్

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఏ విషయమైనా ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టేలా మాట్లాడడంలో బండ్లన్న చాలా నేర్పరి. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ స్టార్ హీరోను మోసం చేశానంటూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

Bandla Ganesh: ఆ స్టార్ హీరోను మోసం చేసి 25 ఎకరాలు కొన్నా.. ఏదో ఒక రోజు ఆయన రుణం తీర్చుకుంటా: బండ్ల గణేష్
Bandla Ganesh
Basha Shek
|

Updated on: Aug 31, 2026 | 9:48 PM

Share

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు బండ్ల గణేష్. తన కామెడీ ట్యాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై గబ్బర్ సింగ్, బాద్ షా వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు బండ్లన్న. కేవలం సినిమాల పరంగానే కాకుండా మంచి వ్యాపార వేత్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఈ క్రమంలోనే ఆస్తులు కూడా బాగానే సంపాదించారని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు బండ్లన్న. అదే క్రమంలో రాజకీయాల్లోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే సినిమా ఈవెంట్లకు, ఫంక్షన్లకు హాజరవుతూనే ఉన్నారాయన. ఎప్పటిలాగే తన స్పీచులు, ఉపన్యాసాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బండ్లన్న ఆసక్తికర విషయం బయటపెట్టారు. తాను ఒక స్టార్ హీరోను మోసం చేసి భూమి కొన్నట్లు చెప్పిన గణేష్, ఆ తర్వాత అతనికి సారీ కూడా చెప్పానన్నారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. ప్రస్తుతం ఇరుముడి సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజ రవితేజ! రవితేజ మంచితనం గురించి గొప్పగా మాట్లాడిన బండ్ల గణేష్ ఇలా చెప్పుకొచ్చారు.

‘రవి తేజ చాలా మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తి. గతంలో ఒక రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహారంలో ఒక సంఘటన జరిగింది. నా దగ్గర 30 ఎకరాల పొలం ఉంది. దాన్ని అమ్మేందుకు పెట్టగా ఒకరు కొనడానికి ముందుకు వచ్చారు. కానీ అతను ఓ కండిషన్ పెట్టాడు. నా భూమి పక్కనే ఉన్న 25 ఎకరాలు కూడా ఉంటేనే కలిపి కొంటానన్నాడు. ఆ సమయంలో అందులో కొంత భాగం హీరో రవితేజ దగ్గర ఉంది. ఆ పొలాన్ని రవితేజ నుంచి తీసుకోవడానికి ఓ అబద్ధం చెప్పాను. ప్రభుత్వం ఆ భూమిని అక్వైర్ (వశపరుచుకోవడం) చేస్తోందని, కాబట్టి అమ్మేయడం మేలని అబద్ధం చెప్పాను. నా మాట నమ్మి రవితేజ కూడా భూమి అమ్మేశాడు. కానీ ఆ తర్వాత నాకు చాలా బాధనిపించింది. రవితేజ తో సినిమా (ఆంజనేయులు) చేస్తే నాకు ఐదు కోట్ల లాభం వచ్చింది. అటువంటి మనిషినా నేను మోసం చేసింది? అన్న భావన నా మనసును బాగా తొలచి వేసింది. కొన్నాళ్ల తర్వాత నేరుగా రవితేజకు దగ్గరకు వెళ్లి అసలు విషయం చెప్పేసి క్షమాపణలు చెప్పాను. కానీ ఆయన నాపై ఎలాంటి కోసం, ఆవేశం ప్రదర్శించకుండా.. ‘నాకు ఆ రోజే ఆ విషయం తెలుసురా” అని చాలా ప్రశాంతంగా ఒక్క మాటతో తేల్చేశారు. ఎవరిపైనా పగ, ద్వేషాలు పెంచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించే మనస్తత్వం రవితేజది. అంతటి గొప్ప వ్యక్తి రుణం ఏదో ఒక రోజు కచ్చితంగా తీర్చుకుంటాను’ అని బండ్లన్న చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి
Bandla Ganesh, Ravi Teja

Bandla Ganesh, Ravi Teja

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us