AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Irumudi: ఒకరు కాదు ముగ్గురు.. రవితేజ ‘ఇరుముడి’ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషనల్ థ్రిల్లర్ ఆగస్టు 21న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రూ.125 కోట్లు దాటేశాయని చిత్ర బృందం చెబుతోంది.

Irumudi: ఒకరు కాదు ముగ్గురు.. రవితేజ 'ఇరుముడి' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Irumudi Movie
Basha Shek
|

Updated on: Aug 29, 2026 | 9:55 AM

Share

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ సినిమా ఫీవర్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కు తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ఈ సినిమాను చూసేందుకు అందరూఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రీజినల్ సినిమాకు పాన్ ఇండియా సినిమా రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్ లోనూ రవితేజ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తుండడం విశేషం. మొదట్లో ఈ సినిమా రవితేజ కెరీర్ లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా నిలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 100 కోట్ల గ్రాస్ కాదు , 100 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టే దిశగా ఇరుముడి సినిమా అడుగులు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ. 150 కోట్లకు చేరవులో ఉన్నాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇరుముడి సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయం వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాకు హీరోగా రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆయన కంటే ముందు ఈ సినిమా కథ పలువురు హీరోల దగ్గరకు వెళ్లిందట. అయితే వివిధ కారణాలతో ఆ హీరోలు రిజెక్ట్ చేయడంతో ఇరుముడి సినిమాకు రవితేజ ఫైనల్ అయ్యారట.

డైరెక్టర్ శివ నిర్వాణ ఇరుముడి సినిమా కథను మొదట అక్కినేని నాగచైతన్యకు వినిపించారట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన మజిలీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ కథను కూడా నాగ చైతన్యకు చెప్పారట. అయితే అప్పటికే చైతూ వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయాడట. ఆ తర్వాత మాచో స్టార్ గోపీచంద్ ను కూడా సంప్రదించారట. అయితే గోపీ చంద్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయలేకపోయాడట. వీరితో పాటు ఇరుముడి సినిమాని మిస్ చేసుకున్న మరో స్టార్ మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. మొదట ఈ సినిమాని తెలుగు , తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించాలని అనుకున్నారు. అందులోనూ తమిళనాడు లో కార్తికేయ స్వామి ని పూజించే వాళ్లు అత్యధిక శాతం ఉంటారు కాబట్టి , ఇటు తెలుగు , అటు తమిళం లో ఈ సినిమా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. అయితే అప్పటికే సూర్య కూడా బిజీగా ఉండి డేట్స్ ఖాళీ లేకపోవడం తో ఈ చిత్రాన్ని మిస్ చేసుకోవాల్సి వచ్చిందట. అలా ఇరుముడి సినిమాను మొత్తం ముగ్గురు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్..

ఇవి కూడా చదవండి

ఇరుముడి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us