అదంతా అబద్ధం.. అస్సలు నమ్మకండి.. పొదరిల్లు సీరియల్ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

16 September 2026

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ ‘పొదరిల్లు’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ సీరియల్‌లో మహాలక్ష్మి పాత్రలో కృతిక క్రేజ్ సంపాదించుకుంది.

 మహాలక్ష్మి

ఈ సీరియల్‌కు సోషల్ మీడియాలోనూ ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించి నెట్టింట జరుగుతున్న ఒక తప్పుడు ప్రచారంపై నటి కృతిక స్పందించారు.

 మహాలక్ష్మి

ప్రస్తుతం ‘పొదరిల్లు’ సీరియల్‌లో కొత్త ఆర్టిస్టులు కావాలంటూ, క్యాస్టింగ్ కాల్ జరుగుతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి

 మహాలక్ష్మి

సీరియల్ నుంచి కొందరిని రీప్లేస్ చేస్తున్నారంటూ వస్తున్న ఈ వదంతులపై కృతిక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అదంతా పూర్తిగా ఫేక్ వార్త అని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు.

 మహాలక్ష్మి

ప్రస్తుతం ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కృతిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులను హెచ్చరిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.

 మహాలక్ష్మి

"దయచేసి ఇలాంటి ఫేక్ క్యాస్టింగ్ కాల్స్, తప్పుడు వార్తలను నమ్మకండి. సీరియల్‌కు సంబంధించి అధికారిక సమాచారం ఏదైనా ఉంటే, అది కచ్చితంగా నిర్మాణ సంస్థ లేదా అధికారిక టీమ్ ద్వారానే వెల్లడవుతుంది.

 మహాలక్ష్మి

అనధికారిక పేజీల నుంచి వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు" అని ఆమె కోరారు. కృతికతో పాటు మరో నటుడు చక్రి కూడా ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ మద్దతు తెలిపారు.

 మహాలక్ష్మి

కృతిక తీసుకున్న ఈ సకాల నిర్ణయం పట్ల ఆమె అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై వెంటనే స్పందించింది. 

 మహాలక్ష్మి