AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘డీసీ’.. లోకేశ్ కనగరాజ్ వంద కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా 'డీసీ'. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు ముస్తాబైంది.

DC Movie OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'డీసీ'.. లోకేశ్ కనగరాజ్ వంద కోట్ల సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
DC Movie
Basha Shek
|

Updated on: Aug 27, 2026 | 6:58 PM

Share

ఖైదీ, మాస్టర్, లియో, కూలీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీసీ. కెప్టెన్ మిల్లర్ తో జాతీయ అవార్డు అందుకున్న అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ లో వామికా గబ్బి హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 07న తెలుగు, తమిళం భాషల్లో రిలీజైన డీసీ సినిమా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు సాధించింది. పాజిటివ్ రివ్యూలకు తోడు మౌత్ టాక్ అద్భుతంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇప్పటికే డీసీ సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. కేవలం సామాన్య ప్రేక్షకులే కాదు అల్లు అర్జున్, మహేష్ బాబు తదితర స్టార్ హీరోలు సైతం డీసీ సినిమాను చూసి ప్రశంసలు కురిపించడం విశేషం. లోకేశ్, వామికాల యాక్టింగ్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్ అన్నిటికీ మించి అనిరుధ్ బీజీఎమ్ డీసీ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. ఇదే నేపథ్యంలో ఓటీటీలోనూ మాస్ మూవీని చూడాలని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డీసీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

డీసీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ స్వయంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. థియేటర్లలో రిలీజైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత డీసీ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11వ తేదీన డీసీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక డీసీ సినిమా విషయానికి వస్తే.. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లు గా నటించారు. అలాగే తలైవాసల్ విజయ్, అవినాష్ రఘు దేవన్, కస్తూరి రాజా, బాలాజీ దేవీ ప్రసాద్, శ్రీకృష్ణ దయాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

డీసీ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us