AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idupu Kayitham: ‘నువ్వు సిన్నబోకే నా శ్రీలత’.. ఆకట్టుకుంటోన్న ప్రియదర్శి, నాగదుర్గల రొమాంటిక్ సాంగ్..

ప్రియదర్శి హీరోగా, తెలుగు అమ్మాయి నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'ఇడుపు కాయితం'. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 'నువ్వు సిన్నబోకే నా శ్రీలత' అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది.

Idupu Kayitham: 'నువ్వు సిన్నబోకే నా శ్రీలత'.. ఆకట్టుకుంటోన్న ప్రియదర్శి, నాగదుర్గల రొమాంటిక్ సాంగ్..
Idupu Kayitham Movie
Basha Shek
|

Updated on: Aug 26, 2026 | 5:08 PM

Share

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ దుర్గ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవాళ (ఆగస్టు 26) హీరో ప్రియదర్శి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అతనికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నువ్వు సిన్నబోకే నా శ్రీలత’ సాగే ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను అలరిస్తోంది. కొత్తగా పెళ్లయిన జంట శ్రీలత, శ్రీనివాస్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, ఓ శ్రీలత శ్రీలత శ్రీలత నువ్వు సిన్నబోకే నా శ్రీలత, శ్రీలత శ్రీలత శ్రీలత ఈ శ్రీనివాసుడే నీ జత’ అంటూ సాగే ఈ పాటలో భార్యాభర్తలు శ్రీలత (నాగదుర్గ), శ్రీనివాస్ (ప్రియదర్శి) మధ్య లవ్, అలక, క్యూట్ మూమెంట్స్ బాగా హైలైట్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కేవలం శ్రీలత సాంగ్ ప్రోమోను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే పాట ఫుల్ వెర్షన్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. అలాగే ఆల రాజు లిరిక్స్ అందించారు. ఇక ఇడుపు కాయితం సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒక అందమైన పల్లెటూరి కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, నాగదుర్గలతో పాటు శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ భేతిగంట, మైమ్ మధు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఇడుపు కాయితం సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇరుముడి శ్రీలత సాంగ్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us