AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara Movie: ‘బింబిసార’ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బింబిసార ఒకటి. వశిష్ట తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ లో బేబీ శ్రీదేవి కూడా ఒక కీలక పాత్ర పోషించింది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.

Bimbisara Movie: 'బింబిసార' సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
Bimbisara Movie Child Artist Sridevi
Basha Shek
|

Updated on: Aug 25, 2026 | 9:14 PM

Share

సుమారు నాలుగేళ్ల క్రితం వచ్చిన బింబిసార సినిమా గుర్తుందా? నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డులు కొల్లగొట్టింది. వశిష్ట తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మేనన్, క్యాథరిన్ థెరీసా హీరోయిన్లు గా నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి. శర్మ, సాయి కిరణ్, తనికెళ్ల భరణి, వైవా హర్ష, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే బింబిసార సినిమాలో కల్యాణ్ రామ్ తర్వాత బాగా హైలెట్ అయ్యింది ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీదేవి. ఇందులో తన క్యూట్ లుక్స్ తో, ముద్దు ముద్దు మాటలతో, ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందీ చిన్నారి. బింబిసార కంటే ముందు పలు సినిమాల్లో నటించింది శ్రీదేవి. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘మేజర్‌’ సినిమాలతో పాటు ప్రేమ, పున్నాగ పౌర్ణమి, చెల్లెలి కాపురం, యమలీల, కళ్యాణ వైభోగమే ఇలా దాదాపు 15 సీరియల్స్ లో కూడా నటించింది.

ఇదిలా ఉంటే ఈ మధ్యన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు శ్రీదేవి. బహుశా తన ఉన్నత చదువుల్లో ఈ పాప బిజీగా ఉంటుందేమో? తాజాగా శ్రీదేవి ఓ టీవీ షోకు వచ్చింది. ఆశ్చర్యకరంగా అదే టీవీ షోకు బింబిసార హీరో కల్యాణ్ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇలా సుమారు నాలుగేళ్ల తర్వాత బింబిసార హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ ఒకే వేదికపై కనిపించారు. ఈ సందర్భంగా శ్రీదేవితో చాలా సేపు మాట్లాడాడు కల్యాణ్ రామ్. ఆమె బాగోగులను అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

టీవీ షోలో కల్యాణ్ రామ్ తో బేబీశ్రీదేవి..

శ్రీదేవి తల్లిదండ్రుల పేర్లు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీహరి గౌడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఉంటే సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది శ్రీదేవి. ట్రెండింగ్ సాంగ్స్ కు డ్యాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అలాగే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లోనూ నటిస్తోందీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us