AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు స్టార్ కమెడియన్ల మిస్సింగ్.. బిగ్‌బాస్ 10 కోసమేనా?

జబర్దస్త్ నుంచి లేటెస్ట్ గా రిలీజైన ప్రోమోలో ఇద్దరు స్టార్ కమెడియన్లు కనిపించకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసమే వారు ఈ కామెడీ షో నుంచి తప్పుకున్నారని గట్టిగా ప్రచారం జోరందుకుంది.

Bigg Boss Telugu 10: జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు స్టార్ కమెడియన్ల మిస్సింగ్.. బిగ్‌బాస్ 10 కోసమేనా?
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Aug 26, 2026 | 6:43 PM

Share

తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లోనూ ఒకేసారి ఒకే సమయంలో బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఇక తెలుగులో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సామాన్యుల ఎంపిక కోసం నిర్వహిస్తోన్న అగ్ని పరీక్ష సీజన్ 2 తుది అంకానికి చేరుకుంది. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్లు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో అయితే రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. కాగా గతంలో లాగే ఈసారి కూడా జబర్దస్ కమెడియన్లు బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని తెలుస్తోంది. నూకరాజు, రాకింగ్ రాకేష్, వర్ష, రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ తదితర జబర్దస్త్ ఆర్టిస్టులు హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా రానున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎవరు హౌస్ లోకి వస్తారన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా చెప్పలేం. అయితే తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో ఇద్దరు స్టార్ కమెడియన్లు కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరే బిగ్ బాస్ 10లోకి వెళుతున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

సాధారణంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు షో ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తమ మిగతా ప్రాజెక్టుల షూటింగ్స్‌కు బ్రేక్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజైన జబర్దస్త్ ప్రోమోలో స్టార్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, అలాగే పొట్టి నరేష్ ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరు బిగ్ బాస్ 10లోకి వెళ్లది ఖాయమైందని, అందుకే జబర్దస్త్ షూటింగ్ కు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

కాగా బిగ్ బాస్ లో జబర్దస్త్ కమెడియన్లకు బాగా ప్రాధాన్యముంది. గతంలో ఇమ్మాన్యుయేల్, ముక్కు అవినాష్, రోహిణి, ఫైమా వంటి స్టార్ కమెడియన్లు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. వీరిలో ఇమ్మాన్యుయేల్, అవినాష్, రోహిణి గ్రాండ్ ఫినాలే వరకు కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఆటో రామ్ ప్రసాద్, పొట్టి నరేష్ లు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ దాకా ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us