AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఇప్పుడు ఈ హీరోయిన్‌ది గోల్డెన్‌ లెగ్.. సినిమా తీస్తే సూపర్ హిట్టే.. వరుసగా 6 వంద కోట్ల చిత్రాలతో సంచలనం

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఒక సినిమా హిట్ అవ్వడమంటనే చాలా అరుదు. అలాంటిది ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలు ఇస్తూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఈ బ్యూటీ నటించిన ఆరు సినిమాలు కూడా వరుసగా వంద కోట్ల క్లబ్ లో చేరాయి.

Actress: ఇప్పుడు ఈ హీరోయిన్‌ది గోల్డెన్‌ లెగ్.. సినిమా తీస్తే సూపర్ హిట్టే.. వరుసగా 6 వంద కోట్ల చిత్రాలతో సంచలనం
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 27, 2026 | 8:15 PM

Share

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏడాదికి ఒక సినిమా తీసి హిట్ కొట్టడమంటేనే చాలా కష్టమైపోయింది. ఇక మూడు, నాలుగేళ్లకు ఒక సినిమా తీసే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఆ సినిమాలు కూడా హిట్ అవుతాయో ఫట్ అవుతాయో తెలియని పరిస్థితి. అయితే ఈ హీరోయిన్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. నీళ్లు తాగినంత ఈజీగా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. మొన్నటివరకు రష్మిక మందన్నా ఇలాంటి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె నటించిన సినిమాలన్న వందలు, వేల కోట్లు కలెక్ట్ చేశాయి. ఇప్పుడు మరో హీరోయిన్ వరుసగా 100 కోట్ల రూపాయల సినిమాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి రీసెంట్ గా విశ్వనాథం అండ్ సన్స్ సినిమాతో పలకరించిన మమితా బైజు. గత కొన్నేళ్లుగా ఈ మలయాళం బ్యూటీ నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సూపర్‌హిట్‌లుగా నిలుస్తున్నాయి. 2024లో విడుదలైన ‘ప్రేమలు’ సినిమా మమిత జీవితాన్ని మార్చేసింది. అంతకు ముందు మమితా బిజు ఎన్నో సినిమాల్లో నటించినా, వాటిలో ఏదీ ఆమెకు సరైన గుర్తింపును తీసుకురాలేదు. కానీ 2024లో వచ్చిన ‘ప్రేమలు’ పెద్ద హిట్టయింది. ఆ సినిమా మలయాళం, తెలుగు భాషల్లో 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కూడా మమితా జోరు కొనసాగింది.

2025లో ‘డ్యూడ్’ అనే సినిమాలో నటించింది మమిత. ఈ సినిమా కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక 2026 సంవత్సరం ఈ హీరోయిన్ కు మర్చిపోలేని ఏడాదిగా చెప్పుకోవచ్చు. ధనుష్ తో కలిసి మమిత నటించిన ‘కర’ ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు సాధించింది. ఆ తర్వాత విజయ్ దళపతి హీరోగా నటించిన జననాయగన్ సినిమాలోనూ మమితా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా కూడా ఓవరాల్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇటీవల విడుదలైన సూర్య సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్’లోనూ మమితా నటించింది. ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ అయి, బాక్సాఫీస్‌ వద్ద 200 కోట్లు వసూలు చేసింది. ఇక ‘విశ్వనాథ్ అండ్ సన్’ విడుదలైన వారం తర్వాత మమిత నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ విడుదలైంది. ఈ చిత్రం కూడా ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద 100 కోట్లు వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇలా మమితా ఒక్క 2026 సంవత్సరంలోనే నాలుగు 100 కోట్ల చిత్రాలను అందించింది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, నటిస్తున్న ఒక కొత్త చిత్రంలో మమితా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ‘ఇరందు వానం’ అనే తమిళ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఆమె నటిస్తోన్న ‘హలో డియర్’ కూడా ఈ ఏడాది విడుదల కానుంది. మరి ఈ చిత్రాలలో ఎన్ని 100 కోట్ల వసూళ్ల మార్కును దాటుతాయో వేచి చూడాలి. మమిత బిజు 2016 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె మొదట బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత సహాయ నటిగా, ఆపై కథానాయికగా నటించింది. 2024లో వచ్చిన ‘ప్రేమలు’ సినిమాకు ముందు మమిత 16 మలయాళ చిత్రాలలో నటించారు. కానీ ‘ప్రేమలు’ సినిమానే ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా లో మమితా బైజు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us