రష్యా నుంచి మనం చమురు కొనకూడదట.. వాళ్లు మాత్రం యురేనియం కొంటారట..! ఇదెక్కడి న్యాయం అధ్యక్షా!?
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించే బిల్లును ఆమోదించింది. భారత్ తన ఇంధన భద్రతను ప్రధానం చేస్తూ రష్యా చమురును కొనుగోలు చేస్తోంది. అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం యురేనియం కొనుగోలు చేస్తూ, ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం గమనార్హం. దీనిపై ట్రంప్ నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతుంది.

రష్యా నుంచి ఏ దేశమైనా చమురు కొనుగోలు చేస్తే బాగోదు మరి.. అని ప్రపంచ దేశాలకు అమెరికా వార్నింగుల మీద వార్నింగులు ఇస్తూ ఉంటుంది. కానీ మన దేశం మాత్రం రష్యా నుంచి చమురు కొంటూనే ఉంది. పోనీ మనం ఒక్కరిమే ఇలా చేస్తున్నామా అంటే కాదు. ఇదేమో ట్రంప్ సర్కారుకు కోపం తెప్పిస్తోంది. అందుకే రష్యా నుంచి చమురు కొనే దేశాల ఎక్స్‌పోర్ట్స్ పై 100 శాతం టారిఫ్ వేయడానికి ఛాన్స్ ఇచ్చే బిల్లుకు.. అమెరికా చట్టసభలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ట్రంప్ సంతకంతో ఇది కార్యరూపం దాలుస్తుంది. దీనిపై మన దేశం కూడా క్లారిటీ ఇచ్చింది. ఆంక్షల బిల్లును జాగ్రత్తగా గమనిస్తూనే.. రియాక్ట్ అయ్యింది. మనకేమో మన దేశ ఇంధన భద్రత ముఖ్యం. దీనికి అనుగుణంగానే వివిధ వనరుల ద్వారా మన దేశానికి ఆయిల్ ఇంపోర్ట్స్ ఉంటాయి. ఇదే విషయాన్ని అమెరికాకు భారత్ గతంలోనూ చెప్పింది.. ఇప్పుడు కూడా అదే చెప్పింది. అయినా రష్యాతో ఆయిల్ బిజినెస్ విషయాన్ని అమెరికాతో గత కొన్నాళ్లుగా చర్చిస్తూనే ఉంది. ఇక 100 శాతం టారిఫ్ ల బిల్లు కార్యరూపం దాలిస్తే.. ఇరు దేశాల సంబంధాల పైనా.. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయిల్ మార్కెట్ల్ పైనా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అదే విషయాన్ని అమెరికాకు క్లియర్ గా, క్లారిటీగా చెప్పింది. ఎవరు ఏమనుకున్నా, ఎన్ననుకున్నా… మన దేశ ప్రయోజనాలు మనకు ముఖ్యం. వీటిని పరిరక్షించడానికి కేంద్రం...
