AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 గంటల్లో మమతా బెనర్జీకి రెండో దెబ్బ.. నందిగ్రామ్‌ మమత వర్గం అభ్యర్థి సంచిత నామినేషన్ విత్‌డ్రా!

బెంగాల్‌లో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో మమతా వర్గం అభ్యర్థిగా ప్రకటించిన సంచితా ప్రధాన్ అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 18) ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమైన అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

24 గంటల్లో మమతా బెనర్జీకి రెండో దెబ్బ.. నందిగ్రామ్‌ మమత వర్గం అభ్యర్థి సంచిత నామినేషన్ విత్‌డ్రా!
Nandigram Bypoll
Balaraju Goud
|

Updated on: Sep 18, 2026 | 4:28 PM

Share

బెంగాల్‌లో మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నందిగ్రామ్ ఉప ఎన్నికల్లో మమతా వర్గం అభ్యర్థిగా ప్రకటించిన సంచితా ప్రధాన్ అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 18) ముఖ్యమంత్రి సువేందు అధికారితో సమావేశమైన అనంతరం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నామినేషన్ ఉపసంహరణకు గల కారణాలను సంచితా ప్రధాన్ అధికారికంగా వెల్లడించలేదు.

కొద్ది రోజుల క్రితమే మమతా బెనర్జీ నేతృత్వంలోని వర్గం నందిగ్రామ్ ఉప ఎన్నికకు సంచితా ప్రధాన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సువెందు అధికారి నందిగ్రామ్ నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై విజయం సాధించిన నేపథ్యంలో ఈ నియోజకవర్గం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత వివాదం మరింత ముదిరింది. మమతా బెనర్జీ, రీటబ్రత బెనర్జీ వర్గాలు పార్టీపై తమదే అసలైన హక్కు అని వాదిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలు ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరు, ‘పూలు-ఆకు’ గుర్తును తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. రెండు వర్గాలు కొత్త పేర్లు, గుర్తులతో ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మమతా వర్గానికి ‘మమతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ఫుట్‌బాల్ ప్లేయర్ గుర్తును, ప్రత్యర్థి వర్గానికి ‘డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్’ పేరుతో ఎన్వలప్ గుర్తును కేటాయించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, నందిగ్రామ్ ఉప ఎన్నికకు అక్టోబర్ 6న పోలింగ్, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ పరిణామాల మధ్య సంచితా ప్రధాన్ నామినేషన్ ఉపసంహరణ నందిగ్రామ్ రాజకీయాల్లో మరింత ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us