ఆకు కూరలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా మునగాకు.. ఇందులో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. మరీ దీన్ని రోజు తెనడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.
మునగాకు
మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంట, నొప్పులను తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా త్వరగా తగ్గిస్తాయి.
నొప్పులకు గుడ్‌బై
మునగలో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది కడుపు పూతలను, ఎసిడిటీకి చెక్ పెడుతుది.
జీర్ణక్రియ
ఈ ఆకుల్లో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను చెక్ పెడుతుంది.
ఎముకలకు బలం
ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. జ్వరం, జలుబు వంటి సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.
ఇమ్యూనిటీ
మునగలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని బెటర్ చేస్తాయి.
గుండె ఆరోగ్యం
మునగలో ఉండే విటమిన్ సి చర్మంపై ముడతలను తగ్గించి.. చర్మాన్ని బ్రైట్‌గా చేస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం
కాబట్టి మీరు రోజూ ఈ ఆకులను మీ ఆహరంలో భాగం చేసుకుంటే.. ఆరోగ్యంగా ఉండమే కాకుండా హాస్పిటల్‌కు వెళ్లాల్సిన పనికూడా ఉండదు.