AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశా.. సాంగ్ రిలీజ్ తర్వాత ఏకంగా లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయట

న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ సినిమా ది ప్యారడైజ్ సెన్సార్ పూర్తైంది. దీనికి సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ బజ్ వచ్చింది. యాక్షన్ సినిమా కదా ఎలా ఉంటుందో, బూతులు గానీ ఎక్కువగా ఉంటాయేమో అని లోపలికి వెళ్లిన వాళ్లకు శ్రీకాంత్ ఓదెల చూపించిన తల్లీ కొడుకుల ఎమోషనల్ సీన్స్, బలమైన ఎపిసోడ్స్, వాటి వెనక ఎమోషన్ చూసి షాక్ అయ్యారని తెలుస్తుంది.

Nani: ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశా.. సాంగ్ రిలీజ్ తర్వాత ఏకంగా లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయట
Nani
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2026 | 8:08 PM

Share

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన దసరా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే చిత్రబృందం కూడా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఓ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ది ప్యారడైజ్’లో తన పాత్ర కోసం నాని పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన జడలతో కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ లుక్ కోసం తాను పడిన కష్టాల గురించి నాని తాజాగా మాట్లాడారు.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

నాని మాట్లాడుతూ.. సినిమా కోసం చాలా కష్టపడ్డాను. కథ డిమాండ్ చేసింది కాబట్టే జడలు వేసుకున్నాను. ఊరికే ఎవరైనా వచ్చి జడలు వేసుకోమంటే మాత్రం వేసుకోను. కథకు అవసరమైతేనే అలాంటి రిస్క్ తీసుకుంటాను. సోషల్ మీడియాలో చిన్న తప్పు జరిగినా వెంటనే ట్రోలింగ్ మొదలవుతుంది. అయినప్పటికీ ‘ది ప్యారడైజ్’ కథ కోసం ఈ రిస్క్ తీసుకున్నాను’’ అని నాని తెలిపారు. అంతేకాదు, సినిమాలోని ఆయా షేర్ పాట విడుదలైన తర్వాత తన లుక్‌కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం తెలిసిందని నాని చెప్పారు.

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

ఈ పాట విడుదలైన తర్వాత చాలామంది రీల్స్ చేసేందుకు జడలు కొనుగోలు చేశారని, ఏకంగా లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయని తమ టీమ్ తనకు చెప్పిందని వెల్లడించారు. నాని చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలో ఆయన జడల లుక్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో ఈ క్రేజ్ ను బట్టి అర్థమవుతోందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us