AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? మీ అవసరానికి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకోండి!

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. అయితే, పెట్టుబడి పెట్టే ముందు చాలామందికి ఎదురయ్యే అతి పెద్ద ప్రశ్న.. ముందుగా స్థలం కొనాలా లేక రెడీగా ఉన్న ఇల్లు/ఫ్లాట్ కొనాలా? అని. ఏది కొన్నా భవిష్యత్తులో లాభాలు తీసుకురావాలి కానీ నష్టాలు మిగల్చకూడదు. ఈ రెండింటి మధ్య ఉన్న లాభనష్టాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...

House Vs Land : ప్లాట్ కొనాలా? ఇల్లు కట్టాలా? మీ అవసరానికి ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకోండి!
Plot Vs House
Jyothi Gadda
|

Updated on: Sep 18, 2026 | 8:17 PM

Share

సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ, చేతిలో ఉన్న డబ్బుతో ముందుగా ఖాళీ స్థలం లేదా ప్లాట్ కొనాలా? లేక నిర్మించిన ఇల్లు కొనాలా? అనే సందిగ్ధం చాలామందిలో ఉంటుంది. ప్లాట్ కొన్నా, ఇల్లు కట్టుకున్నా భవిష్యత్తులో అది లాభదాయకంగా ఉండాలి. కాబట్టి, మీ అవసరాలు, భవిష్యత్తు ప్రణాళికలు, బడ్జెట్‌ను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.

ప్లాట్ (ఖాళీ స్థలం) కొనుగోలు – లాభనష్టాలు:

చాలామంది భవిష్యత్తులో తమకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఖాళీ స్థలం కొంటుంటారు. అపార్ట్‌మెంట్లు లేదా నిర్మించిన ఇళ్ళ కంటే, భూమి విలువ చాలా వేగంగా పెరుగుతుంది. పెట్టుబడి పరంగా చూస్తే స్థలం కొనడం దీర్ఘకాలంలో అధిక లాభాలను ఇస్తుంది. అలాగే, మన ఇష్టానికి అనుగుణంగా ఎప్పుడైనా, ఎలాగైనా ఇల్లు నిర్మించుకునే స్వేచ్ఛ ఉంటుంది.

అదేవిధంగా.. స్థలం కొనడానికి బ్యాంకులు సులభంగా లోన్ ఇవ్వవు, ఇచ్చినా తక్కువ మొత్తంలో ఇస్తాయి. దీనిపై ఎలాంటి ఆదాయపు పన్ను మినహాయింపులు లభించవు. పైగా, స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయడం, కబ్జా కాకుండా చూసుకోవడం వంటి మెయింటెనెన్స్ సమస్యలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నిర్మించిన ఇల్లు లేదా ఫ్లాట్ – లాభనష్టాలు:

రెడీ టు మూవ్ ఇల్లు కొనడం వల్ల వెంటనే అందులోకి మారవచ్చు. తద్వారా అద్దె కట్టే బాధ తప్పుతుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు బ్యాంకులు సులభంగా 80-85శాతం వరకు హోమ్ లోన్ ఇస్తాయి. అలాగే, అసలు, వడ్డీపై భారీగా టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. భవనం పాతబడేకొద్దీ దాని నిర్మాణ విలువ తగ్గుతుంది. దీనిలో మార్పులు చేయడానికి లేదా విస్తరించడానికి స్వేచ్ఛ తక్కువగా ఉంటుంది.

వెంటనే ఇల్లు అవసరం లేని వారు, కేవలం పెట్టుబడి కోణంలో ఆలోచించే వారు ముందుగా స్థలం కొని పెట్టుకోవడం మంచి ఆప్షన్. అదే వెంటనే నివాసం ఉండాలనుకునే వారు, లోన్ సదుపాయం, పన్ను మినహాయింపులు కోరుకునే వారికి ఫ్లాట్ లేదా నిర్మించిన ఇల్లు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
గుడ్లు vs పనీర్.. బరువు తగ్గాలనుకునేవారికి ఏది బెస్ట్..?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
రాజీనామా చేసిన 11 రోజులకే సీఈఓగా రీఎంట్రీ.. అసలు ఏం జరిగింది?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పూరీలు, బజ్జీలు వేయించిన నూనె నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లలు.. ఈ విలన్ ఎలా చనిపోయారంటే?
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
ఎన్నో తప్పులు చేశా.. ఏళ్ల కష్టం తర్వాతే ఆ విషయం అర్థమైంది
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే..
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
శోభనం సీన్.. నేను బెడ్‌పైకి వెళ్లగానే ఆ హీరోయిన్ ఏడ్చేసింది
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
భారత్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే!
వైభవ్, హర్షిత్‌కు మరో ఛాన్స్.. ఈసారి లెక్క సరిచేస్తారా?
వైభవ్, హర్షిత్‌కు మరో ఛాన్స్.. ఈసారి లెక్క సరిచేస్తారా?