AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ప్రేమకథా చిత్రాలతో ఫేమస్.. ఇప్పుడేమో ఇలా ! ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

తెలుగులో పలు హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ ముద్దుగుమ్మ. తన అందం, అభినయంతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయిందీ అందాల తార. చివరిగా 2016లో ఓ సినిమాలో యాక్ట్ చేసిందీ అదాల తార.

Tollywood: ప్రేమకథా చిత్రాలతో ఫేమస్.. ఇప్పుడేమో ఇలా ! ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 31, 2026 | 7:41 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈమె ఒకప్పుడు తెలుగులో ఫేమస్ హీరోయిన్. మరీ వందల కొద్దీ సినిమాలు చేయకపోయినా ఉన్నంతలో మంచి సినిమాలే చేసింది. హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 1991లో విడుదలైన హిందీ సినిమా లమ్హేలో బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2000లో ఓ తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈమె నటించిన మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. మరీ ముఖ్యంగా యూత్ అయితే ఎగబడి ఈ సినిమాను చూశారు. థియేటర్లలో సుమారు రూ. 250 రోజులకు పైగా ఆడిన అతి కొద్ది సినిమాల్లో ఇది కూడా ఒకటి. అలా మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ అందాల తార ఆ తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. హీరోయిన్ పాత్రలతో పాటు సెకెండ్ హీరోయిన్ పాత్రల్లోనూ మెరిసింది. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయిందీ అందాల తార. చివరిలో 2016లో ఒక సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరే చిత్రంలోనూ కనిపించలేదు.

అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయిందీ అందాల తార. తన ఫొటోస్, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది. అలా తాజాగా తన 46వ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ‘నువ్వే కావాలి’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ రిచా. దీంతో పాటు హోలీ, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు, ఇంకోసారి తదితర తెలుగు సినిమాల్లోనూ నటించిన ఈముద్దుగుమ్మ 2016 తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమైంది.

ఇవి కూడా చదవండి

రిచా లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Richa Pallod (@richapallod)

రిచా పొలాడ్ 2011లో హిమాన్షు బజాజ్ ని పెళ్లి చేసుకుంది. 2013లో ఈ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. దీంతో ఫ్యామిలీకే తన సమయాన్ని కేటాయించిందీ అందాల తార. అయితే అప్పుడప్పుడు కొన్ని సినిమాలు, వెబ్ సిరీసుల్లో అతిథి పాత్రలు పోషిస్తోంది రీచా. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. కాగా అప్పటికీ ఇప్పటికీ బాగా మారిపోయింది రిచా. అయితే అందం, గ్లామర్ మెయింటైన్ చేయడంలో ఏ మాత్రం తగ్గడం లేదీ అందాల తార. రిచా ఫొటోలు, వీడియోలు చూసిన అభిమానులు, నెటిజన్లు మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు మేడమ్? అని కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Richa Pallod (@richapallod)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us