AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AadarshaKutumbam: వెంకీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే

ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేశారు వెంకీ. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

AadarshaKutumbam: వెంకీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే
Adarsha Kutumbam
Rajeev Rayala
|

Updated on: Sep 22, 2026 | 7:39 PM

Share

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ఎంటర్‌టైనర్ మరో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న భారీ వినోదాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – AK47’ విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రేక్షకులకు సంపూర్ణ వినోదానుభూతిని అందించాలనే ఉద్దేశంతో చిత్ర విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

కొత్త బంగారు లోకం జోడీ మరోసారి సందడి.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నయా మూవీ

త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. వినోదం, కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us