AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాక్కూడా చేస్తారా! ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్

శంషాబాద్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ.2.91 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ నోట్లను తయారు చేసినట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్‌పై చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇలాక్కూడా చేస్తారా! ఇన్‌స్టా రీల్స్‌ చూసి దొంగనోట్ల తయారీ.. ముగ్గురు అరెస్ట్
Fake Currency
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 8:27 PM

Share

శంషాబాద్‌: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చూసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్‌ రాము, రమావత్‌ మోతిలాల్‌, రమావత్‌ గాంధీ, సుధీర్‌ కలిసి నకిలీ నోట్ల తయారీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్‌ ద్వారా నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్న నిందితులు.. రూ.500, రూ.200, రూ.100 నోట్లను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, పాన్‌ డబ్బాల వద్ద నకిలీ నోట్లను చలామణి చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.

నకిలీ కరెన్సీ చలామణిపై సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన కలర్‌ ప్రింటర్‌, లామినేటర్‌, ఇంక్‌ డబ్బాలు, ఇతర ముడిసరుకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్‌ మీడియాలో నకిలీ కరెన్సీ తయారీ లేదా చలామణికి సంబంధించిన కంటెంట్‌ను ప్రచారం చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ కేఎస్‌ రావు హెచ్చరించారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..