AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సంచలనం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఏడుగురు అంతర్జాతీయ దిగ్గజాలకు షాక్

IPL 2026 : ఐపీఎల్ 2026 లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోగా, ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. వైభవ్ కంటే ముందు రేసులో ఉన్న మిచెల్ మార్ష్, హెన్రిక్ క్లాసెన్, విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను ఈ 15 ఏళ్ల యంగర్ దాటేయడం విశేషం.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో వైభవ్ సంచలనం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఏడుగురు అంతర్జాతీయ దిగ్గజాలకు షాక్
Orange Cap Purple Cap
Rakesh
|

Updated on: May 20, 2026 | 9:52 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో పరుగుల వేట రసవత్తరంగా సాగుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ (LSG) పై రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం ఆరెంజ్ క్యాప్ రేసును పూర్తిగా మార్చేసింది. కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ అన్‌క్యాప్డ్ ప్లేయర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవమున్న ఏడుగురు స్టార్ బ్యాటర్లను ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో వెనక్కి నెట్టేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు వికెట్ల వేటలో ఇచ్చే పర్పుల్ క్యాప్ రేసులో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘ కాలంగా తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటూ దూసుకుపోతున్నాడు.

లక్నో మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ రేసులో కాస్త వెనుకబడి 486 పరుగులతో ఉన్నాడు. అంటే 500 పరుగుల మార్కుకు కూడా ఆయన 14 రన్స్ దూరంలో ఉన్నాడు. కానీ లక్నో బౌలర్లపై కేవలం 38 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 93 పరుగుల రాక్షస ఇన్నింగ్స్ ఆడి.. ఒక్కసారిగా టేబుల్ టాప్‌కు దూసుకెళ్లాడు. వైభవ్ కంటే ముందు రేసులో ఉన్న మిచెల్ మార్ష్, హెన్రిక్ క్లాసెన్, విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లను ఈ 15 ఏళ్ల యంగర్ దాటేయడం విశేషం.

వైభవ్ సూర్యవంశీ వెనక్కి నెట్టిన ఆ 7 గురు స్టార్ బ్యాటర్ల లిస్ట్ ఇదే:

మిచెల్ మార్ష్ – 563 పరుగులు

హెన్రిక్ క్లాసెన్ – 555 పరుగులు

సాయి సుదర్శన్ – 554 పరుగులు

శుభ్‌మన్ గిల్ – 552 పరుగులు

విరాట్ కోహ్లీ – 542 పరుగులు

కేఎల్ రాహుల్ – 533 పరుగులు

అభిషేక్ శర్మ – 507 పరుగులు

ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత వైభవ్ సూర్యవంశీ పేరిట ఐపీఎల్ 2026 లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులు నమోదయ్యాయి. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ పరుగులు ఆయన రికార్డు స్థాయిలో 236.32 స్ట్రైక్ రేట్‌తో, ఏకంగా 53 సిక్సర్లతో సాధించడం క్రికెట్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ ప్రతి ఇన్నింగ్స్‌కు మారిపోతోంది. లక్నో ఇన్నింగ్స్ ముగిసేసరికి మిచెల్ మార్ష్ చేతిలో ఉన్న క్యాప్.. మ్యాచ్ ముగిసేసరికి వైభవ్ సూర్యవంశీ తలపైకి చేరింది.

ఆరెంజ్ క్యాప్ రేసు ప్రతి మ్యాచ్‌కు మారుతుంటే.. పర్పుల్ క్యాప్ రేసులో మాత్రం స్థిరత్వం కనిపిస్తోంది. ఆర్సీబీ (RCB) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 13 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో చాలా కాలంగా నంబర్-1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్‌సీబీ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినందున.. భువీకి ఇంకా మరికొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధికంగా 32 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశం భువనేశ్వర్ కుమార్‌కు లభించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us