Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart attack Symptoms: మహిళల్లో ఈ లక్షణాలు గుండె పోటుకు కారణం కావచ్చు.. జాగ్రత్త సుమా..

గుండె పోటు ముందు వచ్చే లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గుండెపోటుకు సంబంధించి పురుషులు, స్త్రీలల్లో లక్షణాల్లో స్వల్పంగా తేడాలుండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి..

Heart attack Symptoms: మహిళల్లో ఈ లక్షణాలు గుండె పోటుకు కారణం కావచ్చు.. జాగ్రత్త సుమా..
Heart Attack
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 19, 2022 | 8:43 PM

జీవనశైలిలో వస్తున్న మార్పులతో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో వయసు, లింగ బేధంతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల్లో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండె పోటు ముందు వచ్చే లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి ప్రాణం కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గుండెపోటుకు సంబంధించి పురుషులు, స్త్రీలల్లో లక్షణాల్లో స్వల్పంగా తేడాలుండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యనైనా మన శరీరం ముందే గుర్తించి, దాని సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యమంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు గుండె జబ్బులు, స్ట్రోక్‌ల బారిన పడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు, జన్యు లోపాలు కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

చేతుల్లో బలహీనత

గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలను ఎదురవుతాయి. తరచుగా ఈ లక్షణాలన్నీ శరీరానికి ఒక వైపున సంభవిస్తాయి. కానీ దీని ప్రభావం శరీరం అంతటా ఉంటుంది. కొన్నిసార్లు తల తిరగుతున్నట్లు అనిపించవచ్చు. వాంతులు అవుతున్నట్లు కూడా అనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మాటలో స్పష్టత లేకపోవడం

కొన్నిసార్లు చెప్పాలనుకున్న మాటను సరిగ్గా చెప్పలేరు. పదాలు అస్పష్టంగా వస్తాయి. మాట్లాడటానికి కంఠం పెగలదు, తక్కువ స్వరంలో మాట్లాడతారు. కొన్నిసార్లు అసలే మాట్లాడలేకపోవచ్చు. ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన సంకేతాలు కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

మానసిక ఆందోళన

ఆకస్మాత్తుగా గందరగోళానికి గురైతే, మీరు ఎక్కడ ఉన్నారు,మీ చుట్టూ ఏమి జరుగుతోందో అర్థం కానీ అయోమయ పరిస్థితి ఉంటే వెంటనే జాగ్రత్త పడాలి. ఇలాంటి సందర్భంలో మైకంగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. మనిషి నీరసంగా ఉంటారు. మత్తులో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ ఆల్కహాల్ తాగకపోయినా, మత్తులో లేకపోయినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.

నిరంతరమైన తలనొప్పి

దీర్ఘకాలిక మైగ్రేన్లు స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతాయి. మీరు ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని ఎదుర్కొంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆగకుండా ఎక్కిళ్ళు

మనిషికి దాదాపు 30 సెకన్ల పాటు ఎక్కిళ్ళు ఉంటే, అది సాధారణమైనవే. ఆందోళన అవసరం లేదు. అయితే జర్నల్ ఆఫ్ న్యూరాలజీ అండ్ న్యూరోఫిజియాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఆగకుండా నిరంతరం ఎక్కిళ్ళు వస్తుంటే, ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎక్కిళ్లు తగ్గకపోతే, అది స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి ఎక్కిళ్లను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..