Sober October: సోబర్ అక్టోబర్ ఛాలెంజ్ గురించి తెలుసా.. అక్కడ నెల రోజులపాటు మద్యం తాగరట..ఎందుకంటే..

ఒక నెల పాటు మద్యం తాగకపోవడం వల్ల అనేక మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాగా నిద్ర పట్టడంతో పాటు, జ్ఞాపకశక్తి పెరగడం, రోగనిరోధక శక్తి పెరగి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజానలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడాదిలో..

Sober October: సోబర్ అక్టోబర్ ఛాలెంజ్ గురించి తెలుసా.. అక్కడ నెల రోజులపాటు మద్యం తాగరట..ఎందుకంటే..
Sober October Challange
Follow us

|

Updated on: Oct 18, 2022 | 7:05 PM

సోబర్ అక్టోబర్ ఈ పదం వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. దీని వెనుక ఎంతో అర్థం ఉంది. సోబర్ అంటే మత్తు లేని, మద్యం తాగని ఇలా ఎన్నో అర్థాలు వస్తాయి. మద్యం తాగే అలవాటు ఉన్నవారు ఎక్కువుగా ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. దీంతో మద్యానికి అలవాటుపడి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. అందుకే మద్యం తాగేవారిని ఒక నెలరోజుల పాటు మద్యానికి దూరంగా ఉంచేదే ఈ సోబర్ అక్టోబర్. ఈ నెలలో కొంతమంది 31 రోజుల పాటు మద్యపానానికి దూరంగా ఉంటారు. మద్యం తాగేవారు క్యాన్సర్ సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఈ విధానం తోడ్పతుందనేది నిపుణుల అభిప్రాయం. అలాగే తాత్కాలికంగా కొద్ది రోజులు ఆల్కహాల్‌ తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది సోబెర్ అక్టోబర్‌ను పురస్కరించుకుని మద్యం తాగరు. సోబర్ అక్టోబర్ అనే ఆలోచన వాస్తవానికి అండన్ లో క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తుల కోసం డబ్బును సేకరించేందుకు ప్రారంభమైంది. ఇది ఒక ఛాలెంజ్ గా ప్రారంభం కావడంతో పాటు.. మద్యం తాగకపోవడం వలన సేవ్ అయ్యే మనీ క్యాన్సర్ తో బాధపడే వ్యక్తులకు చికిత్స కోసం ఖర్చు చేస్తారు. ఒక వేళ ఛాలెంజ్ లో పాల్గొనకపోయినా నెల రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

నెల రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ప్రయోజనాలు..

ఒక నెల పాటు మద్యం తాగకపోవడం వల్ల అనేక మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాగా నిద్ర పట్టడంతో పాటు, జ్ఞాపకశక్తి పెరగడం, రోగనిరోధక శక్తి పెరగి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వంటి ఎన్నో ప్రయోజానలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏడాదిలో ఒక నెల రోజులు మద్యం తాగకుండా దూరంగా ఉండటం వల్ల ఆ వ్యక్తిలో ఎన్నో మార్పులు ఉంటాయంటున్నారు. మద్యానికి దూరంగా ఉండటం వల్ల నాడీ సంబంధిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆల్కహల్ తాగకుండా ఉంటే ఒక వారంలోనే ఫలితం చూడవచ్చని, అయితే ఒక నెల తర్వాత మరింత మెరుగైన ఫలితం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మద్యానికి బానిస కాకుండా..

సోబర్ అక్టోబర్ వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అది ఏంటంటే ఒక నెల రోజుల పాటు మద్యం తాగకుండా ఉండటం వల్ల జీవితంలో మద్యానికి బానిస కాకుండా ఉండొచ్చు. ఇది జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఏవైనా భావోద్వేగ క్షణాలు ఎదురైనా దానికి మద్యం తాగడం ఒకటే మార్గమనే విషయం నుంచి బయటపడతారు.

ఇవి కూడా చదవండి

ఆల్కహాలు ఎందుకు తీసుకోవాలి..

కొంతమంది జీవితంపై ఆల్కహాల్ ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఆల్కహాల్ ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటున్నాం అనే దానిపై అవగాహన కూడా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా కార్మికులు రోజంతా పని చేసిన తర్వాత శ్రమను మర్చిపోవడానికి మద్యం తాగుతారు. పని తర్వాత ఆల్కహాలు తీసుకోవడం అవసరమా అనే విషయాన్ని సరిగ్గా ఆలోచిస్తే మద్యానికి బానిస కాకుండా క్రమంగా బయట పడవచ్చు. కొంతమందిని ఏడాదిలో ఒక నెల రోజులు మద్యపానానికి దూరంగా ఉంచడం కోసం నిర్వహిస్తున్న ఈ సోబర్ అక్టోబర్ సానుకూల ఫలితాలను ఇస్తోందని లండన్ లోని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..