Gujarat: దాండియా నృత్యం చేస్తూ.. గుండెపోటు.. గుజరాత్ లో మృతిచెందిన 51 ఏళ్ల వ్యక్తి..
గుజరాత్ లో దాండియా నృత్యం చేస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మరణించాడు. పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా సమావేశమైన ఒక వ్యక్తి ఇంట్లో నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు. పిల్లలూ, పెద్దలు కలిసి దాండియా నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తుండగానే..
గుజరాత్ లో దాండియా నృత్యం చేస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురై మరణించాడు. పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా సమావేశమైన ఒక వ్యక్తి ఇంట్లో నవరాత్రి వేడుకలు జరుపుకుంటున్నారు. పిల్లలూ, పెద్దలు కలిసి దాండియా నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తుండగానే ఓ వ్యక్తి కుప్పకూలి పడిపోయాడు. అక్టోబర్ 16వ తేదీ ఆదివారం గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నేవీ బ్లూ టీ షర్ట్ , లేత గులాబీ ప్యాంటు ధరించిన వ్యక్తి డ్యాన్స్ చేస్తూ అలసిపోతూ కనిపించాడు. అప్పుడు అతను నేలపై కుప్పకూలిపోయాడు. అయితే చాలా మంది అతనికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయినప్పటికి ఆకస్మిక గుండెపోటు కారణంగా వ్యక్తి మరణించాడు. అయితే, అసలు కారణం ఇంకా నిర్ధారించబడలేదు. ఇటీవల కాలంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని, డ్యాన్స్ చేస్తున్న సందర్భాల్లో వేదికపైనే కుప్పకూలి మృతిచెందిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. అప్పటి వరకు హ్యాపీగా ఉంటూ డ్యాన్స్ చేస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణిస్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా గుజరాత్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
రమేష్ వంజారా వయసు 51 సంవత్సరాలు, కర్రలతో దాండియా ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. స్థానికులు తక్షణమే రమేష్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా ఏళ్లుగా దేశంలో గుండెపోటుతో మరణించే వారి శాతం పెరుగుతోంది. యువతలో కూడా ఎక్కువుగా ఈ వ్యాధులు సంభవిస్తున్నాయి. ఇటీవల గుజరాత్ లో గర్భా చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు.
ప్రజల్లో జీవనశైలి మారడంతో ఇలాంటి గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఒత్తడి, నిద్రలేమి యువతో గుండెపోటుకు కారణం అవుతున్నాయి.
https://t.co/OzckR639WV WATCH – Man Dies of Heart Attack While Playing Dandiya Raas in Dahod, Gujarat #Dahod #Gujarat #HeartAttack #DandiyaRaas #viralvdoz #video #viralvideo #dies pic.twitter.com/13affmr7Ng
— ViralVdoz (@viralvdoz) October 18, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..