Indian Railway: భారత్‌లో అది పొడవైన రైల్వే మార్గం ఏంటో తెలుసా? 9 రాష్ట్రాలు, 4 వేలకిపైగా కిలోమీటర్లు..
భారతీయ రైల్వేకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజూ లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఇండియన్ రైల్వేకు వందల ఏళ్ల చరిత్రి ఉంది. సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అది..
భారతీయ రైల్వేకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజూ లక్షలాది మందిని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఇండియన్ రైల్వేకు వందల ఏళ్ల చరిత్రి ఉంది. సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉన్న ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అది పెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతిరోజూ సుమారు 3.43 మిలియన్ల మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటే పోతే ఇండియన్ రైల్వేకి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు. అయితే దేశంలో అతి పొడవైన రైల్వే మార్గం ఏంటో తెలుసా.? దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేయండి..
అసోం రాష్ట్రంలోని దిబ్రూఘర్ నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న రైలు మార్గం దేశంలో అతి పొడవైన రైల్వే మార్గంగా పేరు గాంచింది. సుమారు 55 షెడ్యూల్ స్టాప్‌లతో ఈ మార్గం ఉంటుంది. ఈ ట్రాక్‌పై వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుంది. దేశంలోని 9 రాష్ట్రాల మీదుగా, సుమారు 80 గంటల 15 నిమిషాల పాటు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ రైలు ఏకంగా 4,273 కిలోమీటర్లు వెళుతుంది. 2013లో స్వామి వివేకానంద 150 జయంతిని పురస్కరించుకొని వివేక్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ప్రారంభించారు.
Did You Know?
Vivek Express, which runs between Dibrugarh-Kanniyakumari, covers the longest railway route in India, travelling a distance of 4,150 km. pic.twitter.com/FS1OtQRJPi
— Ministry of Railways (@RailMinIndia) October 16, 2022
ఈ రైలు టిన్సుకియా, దిమాపూర్, గౌహతి, బొంగైగావ్, అలీపుర్‌దువార్, సిలిగురి, కిషన్‌గంజ్, మాల్దా, రాంపూర్‌హాట్, పాకూర్, దుర్గాపూర్, అసన్‌సోల్, ఖరగ్‌పూర్, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖోర్ధా, బ్రహ్మపూర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రీ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, వేలూరు, సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్నూర్, కొల్లాం, తిరువనంతపురం, నాగర్‌కోయిల్ స్టేషన్‌ల మీదుగా కన్యాకుమారు చేరుకుంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..