AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukanya Samvrudhi: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో మీ బ్యాలెన్స్ ను సులభంగా చెక్ చేసుకోండి.. ఇలా చేస్తే పోస్టాఫీసుకు వెళ్లక్కర్లేదు..

బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే గతంలో పాస్ బుక్ లో ప్రిటింగ్ వేయించుకుని లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకునేవారు. ఇప్పటికి కొంతమంది పాతకాలం మనుషులు అదే పద్ధతిలో తమ బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం..

Sukanya Samvrudhi: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో మీ బ్యాలెన్స్ ను సులభంగా చెక్ చేసుకోండి.. ఇలా చేస్తే పోస్టాఫీసుకు వెళ్లక్కర్లేదు..
Indian Postal
Amarnadh Daneti
|

Updated on: Nov 04, 2022 | 10:00 PM

Share

బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే గతంలో పాస్ బుక్ లో ప్రిటింగ్ వేయించుకుని లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకునేవారు. ఇప్పటికి కొంతమంది పాతకాలం మనుషులు అదే పద్ధతిలో తమ బ్యాంకు ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందటంతో బ్యాంకుకు వెళ్లకుండానే యాప్ లు లేదా, టోల్ ఫ్రీ నెంబర్లు, మెసెజ్ ల ద్వారా బ్యాలెన్స్ తో పాటు మరికొన్ని బ్యాంకింగ్ సేవలను పొందే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అయితే ఇవి బ్యాంకు ఖాతాదారుల సేవల వరకే పరిమితం. అయితే పోస్టాఫీసు, బ్యాంకుల్లో చాలా మంది సేవింగ్ స్కీమ్స్ లో పొదుపు చేసుకుంటారు. మరి మన సేవింగ్స్ స్కీమ్స్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే పాస్ బుక్ ప్రింట్ వేయించుకోవడం లేదా పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవల్సి వచ్చేది. కాని పోస్టాఫీసులు సైతం ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టడంతో పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ కస్టమర్‌లు తమ ఖాతా సమాచారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ ప్రదేశం నుండి అయినా, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్ అవసరం లేకుండా తెలుసుకోవచ్చు. జాతీయ పొదుపు పథకాల ఖాతాదారులకు సరళీకృతమైన, మెరుగైన డిజిటల్ సౌకర్యాలను అందించడానికి ఈఏడాది అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ-పాస్‌బుక్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి ఖాతాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌ ఉపయోగించవచ్చు. ఈ సేవ ఉచితంగా లభిస్తుంది. ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇ-పాస్‌బుక్ సదుపాయాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

బ్యాలెన్స్ విచారణ

వినియోగదారు ఈ ఎంపికను ఉపయోగించి ప్రతి నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా యొక్క బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.

మినీ స్టేట్‌మెంట్

పొదుపు ఖాతాలు (పీఓఎస్ ఎ), సుకన్య సమృద్ధిఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ( పిపిఎఫ్ ) కోసం మినీ స్టేట్‌మెంట్‌లు మొదట అందుబాటులో ఉంచుతారు. ఆపై క్రమంగా ఇతర పథకాలకు అందుబాటులో ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇ-పాస్‌బుక్

పిపిఎఫ్, సేవింగ్ ఖాతా, సుకన్య సమృద్ధి ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చేసే విధానం www.indiapost.gov.in లేదా www.ippbonline.comలో అందించబడిన ఇ-పాస్‌బుక్ లింక్‌పై క్లిక్ చేయండి. లేదా నేరుగా ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అఫిషియల్ పేజీ ఓనెన్ అవుతుంది.

ఆ తరువాత మొబైల్ నంబర్‌ని నమోదు చేయాలి. అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ OTPని సమర్పించాలి. ఆతర్వాత మన ఖాతాలో బ్యాలెన్స్ తదితర వివరాలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా