APPSC Group 1 last date: చివరి అవకాశం.. రేపటితో ముగుస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ -1 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు..

APPSC Group 1 last date: చివరి అవకాశం.. రేపటితో ముగుస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ..
APPSC Group -1 Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2022 | 4:46 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ -1 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్‌ 5వ తేదీ ముగింపు సమయం లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సిందిగా కమిషన్‌ సూచించింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 2వ తేదీతో ముగియనుండగా తాజాగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నవంబర్‌ 5వ తేదీ వరకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. కాగా మొత్తం 92 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ముగింపు సమయంలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.120లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష (ప్రిలిమ్స్/మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష డిసెంబర్‌ 18, 2022న నిర్వహించనున్నారు. మార్చి 2023లో మెయిన్స్‌ రాత పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,060ల నుంచి రూ.1,51,370ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో