Sudhir Suri: శివసేన నేతపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి చెందిన వైనం!

శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుధీర్ సూరి అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని ఓ ఆలయం వెలుపల నిరసన తెలుపుతుండగా, గుంపులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి..

Sudhir Suri: శివసేన నేతపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి చెందిన వైనం!
Shiv Sena leader Sudhir Suri shot dead
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2022 | 8:16 PM

శివసేన నేత సుధీర్ సూరిపై శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుధీర్ సూరి అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలోని ఓ ఆలయం వెలుపల నిరసన తెలుపుతుండగా, గుంపులో నుంచి గుర్తు తెలియని వ్యక్తి సూరిపై కాల్పులు జరిపినట్లు అమృత్‌సర్‌ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌పాల్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు. ఆలయం వెలుపల ఉన్న చెత్తకుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించాయి. ఆలయ నిర్వాహకుల నిర్లక్షానికి నిరసన తెలుపుతూ సూరి, మరి కొంతమంది కార్యకర్తలతో కలిసి ఆలయం ముందు బైఠాయించారు. నిరసన సమయంలో గుర్తుతెలియని దుండగుడు తుపాకితో సూరిపై దాడి చేసి, కాల్పులు జరిపాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని సందీప్ సింగ్‌గా గుర్తించారు. కాగా ఇప్పటికే సూరి హిట్‌లిస్ట్‌లో ఉన్నాడని, దీంతో పోలీసులు భారీ భద్రత కల్పించారు. గత జూలై నెలలో ఒక వర్గానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పదజాలాలతో దురుసుగా మాట్లాడాడని, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడనే ఆరోపణలపై సూరిని పోలీసులు అరెస్టు చేశారు. సూరి అరెస్టుపై అప్పట్లో పలు వార్తాకథనాలు కూడా వెలువడ్డాయి.

తాజా ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు తజిందర్ సింగ్ బగ్గా ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయని, అధికార పార్టీ (ఆప్‌) నిర్లక్ష్యం మూలంగానే సూరి మృతి చెందాడని సోషల్‌ మీడియా వేదికగా ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం క్లిక్ చేయండి.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో