AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Tips: ఈ టిప్స్‌తో కరెంట్ బిల్లును తగ్గించుకోండిలా.. తప్పక తెలుసుకోండి..

ఇకపై పెరుగుతున్న కరెంటు బిల్లుతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దీని కోసం మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకుంటే మంచిది.

Electricity Tips: ఈ టిప్స్‌తో కరెంట్ బిల్లును తగ్గించుకోండిలా.. తప్పక తెలుసుకోండి..
Electricity Tips
Ravi Kiran
|

Updated on: Nov 04, 2022 | 6:55 PM

Share

ఇకపై పెరుగుతున్న కరెంటు బిల్లుతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. దీని కోసం మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకుంటే మంచిది. నేటి కాలంలో పెరుగుతున్న కరెంటు బిల్లులు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోందన్న విషయం తెలిసిందే. ఈ ద్రవ్యోల్బణం కాలంలో ప్రజలు కరెంటు బిల్లుల షాక్‌ను తట్టుకోలేకపోతున్నారు. విద్యుత్ ధరలు పెరగడం, వినియోగం ఎక్కువ కావడంతో బిల్లు భారీగా వస్తోంది. మరి ఇప్పుడు ఎలా..

విద్యుత్ ఛార్జీలను తగ్గించడం మీ చేతుల్లో లేదు కాని, కరెంటును సక్రమంగా వాడుకోవడం ద్వారా పెరుగుతున్న వ్యయాన్ని సులభంగా నియంత్రించుకోవచ్చు. పొదుపు కోసం సరైన మార్గంలో విద్యుత్తును ఉపయోగించడం వల్ల బిల్లులో కొంత ఉపశమనం పొందవచ్చు. దానికోసం చిన్న మార్పులు చేస్తే చాలు. ఏసీలు, కూలర్‌లు, హీటర్స్ దాదాపు 80 శాతం కరెంటును వినియోగిస్తాయన్నది తెలిసిందే.

మీ ఇళ్లల్లో లేదా కార్యాలయాలలో పాత బల్బులు, ట్యూబ్ లైట్లను ఉపయోగిస్తుంటే, వాటిని వెంటనే తీసేసి బదులుగా LED లైట్లను ఉపయోగించడం ప్రారంభించండి. ఎందుకంటే అవి మీకు సాధారణ బల్బు కంటే ఎక్కువ కాంతిని ఇవ్వడమే కాదు.. విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి. మీరు ఏసీని వినియోగిస్తున్నట్లయితే.. దాన్ని మరీ తక్కువ లేదా చాలా ఎక్కువ టెంపరేచర్‌లో పెట్టొద్దు. మధ్యస్తంగా పెట్టండి. ఈ విషయాలను మీరు తప్పక చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరోవైపు మీ ఇంటిలో నీటి కోసం గీజర్ లేదా హీటర్‌ని ఉపయోగిస్తుంటే, ఉపయోగించిన తర్వాత దాన్ని వెంటనే ఆఫ్ చేయండి. ఎందుకంటే అలాంటి పరికరాలు అత్యధిక విద్యుత్తును వినియోగిస్తాయి. ఇప్పుడు చలికాలం కూడా వచ్చింది కాబట్టి, పలువురు రూమ్ హీటర్స్ వినియోగిస్తారు. వాటి ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ తక్కువగా ఉంచండి, అలాగే వినియోగించిన వెంటనే వాటిని ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. అదే సమయంలో, వాషింగ్ మెషిన్‌లో దాని సామర్థ్యం మేరకు బట్టలు వేయండి. ఇవే కాదు.. ఉపయోగించనప్పుడు టీవీ లేదా కంప్యూటర్‌ను ఆఫ్ చేయండి.

సోలార్ ప్యానెళ్లతో విద్యుత్ బిల్లు ఆదా..

మీరు మీ ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలనుకుంటే, సోలార్ ప్యానెళ్లు సరైన ఆప్షన్. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ మీ విద్యుత్ బిల్లును సగానికి తగ్గిస్తాయి. వాటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉపయోగిస్తే మాత్రం విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది.

శక్తిని ఆదా చేసే సాకెట్ పరికరం

మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు ఆఫ్ చేయడం మర్చిపోతే, శక్తిని పొదుపు చేసే సాకెట్ పరికరాన్ని అమరిస్తే మంచిది. ఈ పరికరం 230V 24×7 ఎనర్జీ సేవింగ్ సాకెట్ డిజిటల్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ టైమర్‌తో వస్తుంది. ఇది మీ ఎలక్ట్రిక్ పరికరాలు, స్విచ్‌ల ఆన్, ఆఫ్ చేయడానికి షెడ్యూల్‌ను సెట్ చేయడానికి మీకు సహకరిస్తుంది. దీంతో సులువుగా కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..