Viral: నవజాత శిశువుకు ఉబ్బిన పొట్ట.. డాక్టర్లు స్కాన్ చేసి రిపోర్ట్స్ చూడగా.. ప్రపంచంలోనే ఇదే మొదటిసారి..
21 రోజులు వయసున్న నవజాత శిశువు కడుపులో నుంచి ఎనిమిది పిండాలను తొలగించారు వైద్యులు. ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
ఓ అరుదైన కేసు ఝార్ఖండ్‌లో వెలుగు చూసింది. బహుశా ప్రపంచ వైద్య చరిత్రలో ఇదే మొదటిసారి జరిగిన వింత సంఘటన అని చెప్పవచ్చు. 21 రోజులు వయసున్న నవజాత శిశువు కడుపులో నుంచి ఎనిమిది పిండాలను తొలగించారు వైద్యులు. ఈ ఘటన రాంచీలో చోటు చేసుకోగా.. దాని సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాంచీలోని రామ్‌గడ్‌లో అక్టోబర్ 10వ తేదీన ఓ ఆడబిడ్డ జన్మించింది. అనంతరం డిశ్చార్జ్ అయ్యి.. కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొద్దిరోజుల తర్వాత నవజాత శిశువు పొట్ట విపరీతంగా ఉబ్బిపోవడం.. కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడి.. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శిశువుకు సీటీ స్కాన్ చేయగా.. కడుపులో కణితులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక 21 రోజుల అబ్సర్వేషన్ అనంతరం శిశువుకు నవంబర్ 1వ తేదీన డాక్టర్లు ఆపరేషన్ చేశారు.
ఆపరేషన్ సమయంలో పాప కడుపులో ఉన్నవి కణితులు కాదని, పిండాలని వైద్యులు నిర్ధారణకు వచ్చి.. షాక్ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శస్త్రచికిత్స నిర్వహించి ఆ పిండాలను తొలగించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం బాగుందని చెప్పారు. కాగా, ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఇలాంటి శిశువు పొట్టలో పిండాలు అభివృద్ధి చెందిన ఘటనలు చాలా అరుదు అని.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రేర్ కేసులు వందలోపు ఉండొచ్చునని పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ఒక పిండాన్ని మాత్రమే తొలగించారని.. అయితే ఈ నవజాత శిశువు పొట్టలో 8 పిండాలు ఉన్నాయని.. ఈ కేసు ప్రపంచంలోనే మొదటిదని డాక్టర్లు స్పష్టం చేశారు.(Source)