Kantara OTT: ఓటీటీలోకి ‘కాంతారా’ వచ్చేది అప్పుడేనా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే.?
కన్నడ సినిమా స్థాయిని మరోసారి ఇండియాకు పరిచయం చేసింది 'కాంతారా'. ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కడమే కాదు..

‘కాంతారా’.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ. కన్నడంలో చిన్న సినిమాగా విడుదలై.. బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిందీ ఈ చిత్రం. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ కన్నడ సినిమా స్థాయిని మరోసారి ఇండియాకు పరిచయం చేసింది. ఈ మూవీ తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కడమే కాదు.. కలెక్షన్ల పరంగా రికార్డు వసూళ్లు కొల్లగొడుతోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో స్ట్రాంగ్ రన్ కొనసాగుతోన్న ‘కాంతారా’ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉంటే.. ‘కాంతారా’ చిత్రం మరికొన్ని రోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ భారీ ధరకు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ‘కాంతారా’ ఈ నెల 18వ తేదీ నుంచి కన్నడం, తమిళ, తెలుగు, హిందీ, భాషల్లో అందుబాటులో ఉండనుందని టాక్. అయితే పే పర్ వ్యూలోనా లేక ఉచితం గానా అనేది తెలియాల్సి ఉంది.
కాగా, హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై.. కేజీఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టిన విషయం విదితమే. మరోవైపు ‘కాంతారా’ నవంబర్ 18వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయినట్లయితే.. ఒక్క రోజు గ్యాప్‌తో అటు నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ అనగా నవంబర్ 19వ తేదీన స్ట్రీమింగ్‌కు సిద్దం అవుతోంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య ఓటీటీలో ఫైట్ మాములుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
