Telangana: వ్యభిచార వృత్తిలో ఇద్దరు మహిళల మధ్య పోటీ.. పార్టీ ఇస్తానంటూ ఇంటికి పిలిచి..

వారిది ఒకే ఊరు.. ఇద్దరూ ఒంటరి మహిళలే.. అంతే కాకుండా ఉపాధి కోసం ఒకే ప్రాంతానికి వెళ్లారు. భర్త, కుటుంబం నుంచి ఆదరణ లేకపోవడం, మహిళ అనే కారణంతో పనులు ఇవ్వకపోవడంతో వారు వ్యభిచార..

Telangana: వ్యభిచార వృత్తిలో ఇద్దరు మహిళల మధ్య పోటీ.. పార్టీ ఇస్తానంటూ ఇంటికి పిలిచి..
Crime
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 04, 2022 | 6:48 PM

వారిది ఒకే ఊరు.. ఇద్దరూ ఒంటరి మహిళలే.. అంతే కాకుండా ఉపాధి కోసం ఒకే ప్రాంతానికి వెళ్లారు. భర్త, కుటుంబం నుంచి ఆదరణ లేకపోవడం, మహిళ అనే కారణంతో పనులు ఇవ్వకపోవడంతో వారు వ్యభిచార వృత్తినే ప్రధాన పనిగా తీసుకున్నారు. అలా వచ్చిన డబ్బుతో జీవించారు. ఇంత వరకు వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. కానీ ఎప్పుడైతే తన కంటే ఎక్కువ సంపాదిస్తుందన్న అనుమానం మొదలయ్యిందో అప్పటి నుంచి ఇబ్బందులు తలెత్తాయి. వ్యభిచారం చేస్తూ తన కంటే ఎక్కువ మొత్తాన్ని అర్జిస్తుందన్న విషయాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తనకేం తక్కువ. నేనెందుకు సంపాదించలేననే సందేహం నిలువెల్లా పాకిపోయింది. తనకు అడ్డుగా ఉన్న మహిళను అంతమొందించాలనుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం పార్టీ ఇస్తానని ఇంటికి పిలిచింది. ఆమె మాటలు నమ్మి ఇంటికి వెళ్లిన సదరు మహిళ.. వారి చేతిలో దారుణ హత్యకు గురైంది.

రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఫరూక్‌నగర్‌ మండలం కమ్మదనంలో నివాసముంటోంది. ఆమె స్నేహితురాలు ఒకావిడ పడువు వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇద్దరూ ఒంటరిగా నివాసముండడంతో వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఆ పరిచయం మరింత సాన్నిహిత్యంగా మారింది. ఈ క్రమంలో గంగన్నగూడెంకు చెందిన మహిళ.. తనకన్నా ఎక్కువ సంపాదిస్తుందనే మరో మహిళలో అసూయ కలిగింది. పోటీగా ఉన్న ఆమెను తప్పించాలని నిర్ణయించుకుంది. హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఇందుకు ఆర్టీసీ బస్టాండులో స్వీపర్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తి సహకారం తీసుకుంది. గత నెల 23 న పార్టీ ఇస్తానని సదరు మహిళను నమ్మించి, తన ఇంటికి ఆహ్వానించింది. రాత్రి మద్యం తాగాక లింగంతో కలిసి ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది.

అనంతరం ఏమీ ఎరగనట్లుగా మృతదేహాన్ని గోనెసంచిలో వేసి, తంగెళ్లపల్లి సమీపంలో వాగు పక్కన పడేశారు. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దొరికిన బస్సు టికెట్ల ఆధారంగా మృతురాలిని గుర్తించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం