నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య గ్యాప్ వస్తే.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకండి..

నిశ్చితార్థం తర్వాత జీవితం కేవలం డేటింగ్, మీటింగ్‌లకు మాత్రమే పరిమితం కాదు.. వివాహం అనేది నిజాయితీ, విశ్వాసం అనే పునాదులపై నిర్మించబడుతుంది.. మీ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మీతో మీరు నిజాయితీగా ఉండటం కూడా అంతే ముఖ్యం.

నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య గ్యాప్ వస్తే.. ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకండి..
Same 'gotra' Marriage
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2022 | 12:25 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయి తమ జీవితమంతా ఆ ఇద్దరు ఒకరితో ఒకరు కలిసే గడపాల్సి ఉంటుంది. కాబట్టి పెళ్లికి ముందు ఒకరినొకరు సరిగ్గా తెలుసుకోవడం ముఖ్యం. నిశ్చితార్థం, వివాహం మధ్య సమయం చాలా విలువైనది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాకుండా ఒకరినొకరు కలుసుకోవడం ద్వారా వారి సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఈ సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మీ వైవాహిక జీవితం మధురంగా సాగుతుందనడంలో సందేహం లేదు. దానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

మీకు నిశ్చితార్థం అయిపోయిందా..? ఎంగేట్‌మెంట్‌, పెళ్లికి మధ్య చాలా గ్యాప్‌ ఉందా? అవును అయితే, మీరు మీ జీవితంలో అత్యుత్తమ సమయాన్ని గడుపుతున్నారు. నిశ్చితార్థం నుండి వివాహం వరకు ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. ఈ రోజుల్లో అంతా సినిమాలా అనిపిస్తోంది. ఈ సమయంలో మీరు మీకు కాబోయే జీవిత భాగస్వామిని చాలా దగ్గరగా తెలుసుకోవడమే కాకుండా, ఈ సమయంలో మీరు వారిని బాగా అర్థం చేసుకునే అవకాశం కూడా పొందుతారు.

అయితే, ఇది కూడా ఒకింత కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒకరితో ఒకరు డేటింగ్ చేసుకునే సమయం కాదు. బదులుగా మీరు కొత్త సంబంధంలోకి ప్రవేశిస్తున్న సమయం అంటే మీరు వివాహం గురించి ఆలోచిస్తున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో మీ కాబోయే భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉండే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే..నిశ్చితార్థం తర్వాత ఎక్కువ టైమ్‌ పెళ్లి తంతుకు సంబంధించిన ఏర్పాట్లుతోనే గడుపుతారు. కానీ, మీరు మీ సంబంధాన్ని బలోపేతం చేయాలనుకుంటే, పెళ్లి ఏర్పాట్లు కాకుండా మరేదైనా ప్రయత్నించండి. మీరు మీ హనీమూన్ ప్లేస్‌ గురించి చర్చించుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు ఇరువురు కలిసి కొన్ని కార్యకలాపాలను కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రతి ఒక్కరికీ పెళ్లికి ముందు లేదా తర్వాత నెరవేర్చుకోవాలనుకునే స్వల్పకాలిక, దీర్ఘకాలిక కలలు అనేవి ఉంటాయి. ఈ కలలను మీ భాగస్వామితో షేర్‌ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరిద్దరూ మీ కలలు, సంతోషాలను సాకారం చేసుకోగలుగుతారు. కానీ మీరు ఒకరి కోరికలను ఒకరు గౌరవించుకోవడం ద్వారానే మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు.

నిశ్చితార్థం చేసుకున్న తర్వాత మీరు నిజంగా మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మీరు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మీరు మీ జీవితమంతా ఈ వ్యక్తితో గడపబోతున్నారు. కాబట్టి, మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అబ్బాయికి లేదంటే ఆ అమ్మాయికి ఏది ఇష్టమో, ఇష్టపడనిది ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది.

వివాహం అనేది నిజాయితీ, విశ్వాసం అనే పునాదులపై నిర్మించబడుతుంది.. మీ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మీతో మీరు నిజాయితీగా ఉండటం కూడా అంతే ముఖ్యం. చాలా సార్లు ఒకరికొకరు తెలియకుండానే పెళ్లి చేసుకుంటారు. కానీ వారు గ్రహించే సమయానికి చాలా ఆలస్యం..అనర్థాలు జరిగిపోతుంటాయి.. మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే, మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో బహిరంగంగా పంచుకోండి. దీంతో సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు.

నిశ్చితార్థం- వివాహం మధ్య సంబంధంలో నిబద్ధతతో ఉండండి. మీ భాగస్వామి సంబంధానికి కట్టుబడి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారు సంకోచం లేకుండా మీతో జీవితాన్ని గడపడం గురించి మాట్లాడుతున్నారా? లేదా ? తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి, ఈ సంబంధం పట్ల మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో చూపించడానికి ఇది సరైన సమయం.

మీరు మీ భాగస్వామితో జీవితాన్ని గడపాలని ఊహించినప్పటికీ కుటుంబ సభ్యులకు వివరించండి. వీటన్నింటి మధ్య కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపడానికి కుటుంబ సభ్యులతో బలమైన బంధాన్ని కలిగి ఉండటం కూడా ముఖ్యం. మీ భాగస్వామి వారి హృదయాన్ని గెలుచుకోవడానికి ఏం చేస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ భాగస్వామి కుటుంబాన్ని మరింతగా తెలుసుకోవడం కోసం వారితో కలిసి డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు.

నిశ్చితార్థం తర్వాత జీవితం కేవలం డేటింగ్, మీటింగ్‌లకు మాత్రమే పరిమితం కాదు..ఇది కుటుంబ నియంత్రణ గురించి చర్చించాల్సిన సమయం కూడా. మీ భాగస్వామికి పిల్లల పట్ల ఆసక్తి ఉందో లేదో తెలుసుకోండి. ఇది మాత్రమే కాదు, గతంలోని అనేక విషయాలు ఈ సమయంలో మీ ప్రస్తుత సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి.

మొత్తం మీద, సన్నిహిత సంబంధం కోసం, మీ వైవాహిక జీవితానికి ఆటంకం కలిగించే ఏదైనా దాని గురించి మీ భాగస్వామికి చెప్పడానికి సంకోచించకండి. ఈ సమయంలో మీరు వారు కోరుకున్న విధంగా ప్రవర్తించడం సరికాదు, వారితో మీ గురించి ఓపెన్‌గా ఉండటం కూడా ముఖ్యం. దీనివల్ల వైవాహిక జీవితం చాలా బాగుంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!