పోలీస్‌ ఖాకీ రంగు కహాని తెలుసా..? చరిత్రలో తొలిసారి ఎప్పుడు ఎక్కడ పుట్టిందంటే..

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పోలీసుల ఖాకీ యూనిఫాం మొదట ఎక్కడ తయారైందో తెలుసా..? ప్రస్తుతం ఇదే ఖాకీ కలర్ యూనిఫాం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దేశంలో పోలీసు యూనిఫాం అమలుపై ప్రధాని మోదీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పోలీస్‌ ఖాకీ రంగు కహాని తెలుసా..? చరిత్రలో తొలిసారి ఎప్పుడు ఎక్కడ పుట్టిందంటే..
Police
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2022 | 9:33 AM

ఖాకీ.. ఈ రంగు చెప్పగానే.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మనల్ని కాపాడుతున్న పోలీసుల ముఖం మన కళ్ల ముందు తిరుగుతుంది. ఖాకీ యూనిఫాం దేశానికి గర్వకారణం. గౌరవమైనది కూడా. కరోనా కాలంలో కూడా ఖాకీ యూనిఫాం ధరించిన పోలీసులు తమను తాము పట్టించుకోకుండా 24 గంటలూ శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉన్నారు. మనమంతా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఖాకీ యూనిఫాం ధరించిన ఈ దేశ కాపలాదారులు మేల్కొని ఉంటారు. వాళ్లు వీధి నిర్వహణలో ఉంటే.. ప్రజలు వాళ్ల ఇళ్లలో సురక్షితంగా ఉంటారు. ప్రజల భద్రతకు పర్యాయపదంగా మారిన ఈ ఖాకీ రంగు చరిత్ర ఏమిటో తెలుసా..? ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పోలీసుల ఖాకీ యూనిఫాం మొదట ఎక్కడ తయారైందో తెలుసా..? ప్రస్తుతం ఇదే ఖాకీ కలర్ యూనిఫాం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దేశంలో పోలీసు యూనిఫాం అమలుపై ప్రధాని మోదీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిపాదించిన ‘ఒకే దేశం-ఒకే యూనిఫాం’ విధానం అమలు సందర్భంగా ఖాకీ రంగు యూనిఫాం చరిత్ర ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పోలీసుల ఖాకీ యూనిఫాం మొదట కన్నడలో తయారైంది. అది కూడా కోస్తా కర్ణాటకలోని మంగళూరులో. బాసెల్ మిషన్ మొదటి నేత కర్మాగారం 1844లో మంగళూరులో ప్రారంభించబడింది. 1851లో ఈ కర్మాగారంలో తొలిసారిగా ఖాకీ రంగు వస్త్రం ఉత్పత్తి చేయబడింది. కర్మాగార బాధ్యతలు నిర్వహిస్తున్న జాన్ హాలర్ తొలిసారిగా ఖాకీ రంగును కనిపెట్టాడు. సెమికార్పస్ చెట్టు బెరడు నుండి ఖాకీ అనే కొత్త రంగును కనుగొనడంలో అతను విజయం సాధించాడు. దీంతో ఇక్కడ చాలా మందికి ఉపాధి లభించింది. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లార్డ్ రోబార్చ్ ఈ నేత కర్మాగారాన్ని సందర్శించి ఖాకీ రంగుకు ఆకర్షితుడయ్యాడు. ఇదే రంగు తర్వాత బ్రిటీష్ సైన్యం యూనిఫారంగా ప్రపంచవ్యాప్తంగా స్వీకరించబడింది.

ఖాకీ రంగు మురికిగా ఉన్నప్పటికీ అది ఈజీగా పైకి కనిపించదు. ఈ కారణంగా, ఖాకీ రంగు హార్డ్ వర్క్, యాక్టివిటీకి సరిపోతుందని బ్రిటిష్ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై ఇక్కడి బ్రిటిష్ అధికారులు బ్రిటన్ రాణికి లేఖ కూడా రాశారు. దీంతో వివిధ దేశాల సైన్యంలో ఖాకీ కలర్ యూనిఫాంలకు ప్రాధాన్యం ఏర్పడిందని బాసెల్ మిషన్ పై పీహెచ్ డీ పరిశోధనలు చేసిన పుత్తూరు రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పీటర్ విల్సన్ ప్రభాకర్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర పాలిత ప్రాంతాలు, కొన్ని దేశాలు మినహా అన్ని చోట్లా ఖాకీ పోలీసు యూనిఫారంగా ఉంటుంది. ప్రతిచోటా క్రమశిక్షణను కొనసాగించడానికి ఒక ముఖ్యమైన ఆయుధంగా, ఖాకీ రంగు గౌరవానికి చిహ్నంగా స్థానం పొందింది. మంగళూరులో ఖాకీ రంగును కనిపెట్టినందుకు గుర్తుగా భారత తపాలా శాఖ ప్రత్యేక స్టాంపును కూడా విడుదల చేసింది.

ఖాకీ రంగు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని ఆకర్షించడమే కాకుండా, అంతకు మించి విస్తరించింది. అటవీ శాఖ గార్డులు, రైల్వే గ్యాంగ్‌మెన్లు, హోంగార్డు సిబ్బంది, సివిల్ సర్వెంట్లు, అగ్నిమాపక దళం, పోస్టల్ డిపార్ట్‌మెంట్ పోస్ట్‌మెన్లు, ఆర్‌టిసి డ్రైవర్-ఆపరేటర్లు కూడా ఖాకీ యూనిఫాం ధరిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలో ఖాకీ రంగుల షార్ట్‌లను కూడా క్రమశిక్షణకు చిహ్నంగా ఉపయోగించారు. ఇప్పుడు డార్క్ బ్రౌన్ ఖాకీ ప్యాంట్లు వాడుకలో ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న పోలీసు శాఖలో ఖాకీ యూనిఫాం మంగళూరు నుంచి వచ్చిన బహుమతి. ఒకే యూనిఫాం విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు అదే యూనిఫారమ్‌ను కొనసాగించాలని కన్నడీగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రపంచానికి ఖాకీ యూనిఫాం కానుకగా నిలిచిపోయే అవకాశం, గొప్ప గుర్తింపు లభిస్తుందని అని బాసెల్ మిషన్‌లోని రిటైర్డ్ ప్రిన్సిపాల్ పీహెచ్‌డీ పరిశోధకుడు డాక్టర్ పీటర్ విల్సన్ ప్రభాకర్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!