AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఐపీఎస్‌ అధికారి తీరుపై హైకోర్టును ఆశ్రయించిన ధోనీ.. రూ. 100 కోట్ల పరువు నష్టం ఇవ్వాలంటూ..

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్‌ఎస్‌ ధోనీ హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎస్‌ అధికారి జీ సంపత్‌కు వ్యతిరేకంగా ధోనీ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్ పిఎన్ ప్రకాష్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందుకు కేసు...

MS Dhoni: ఐపీఎస్‌ అధికారి తీరుపై హైకోర్టును ఆశ్రయించిన ధోనీ.. రూ. 100 కోట్ల పరువు నష్టం ఇవ్వాలంటూ..
Ms Dhoni
Narender Vaitla
|

Updated on: Nov 05, 2022 | 9:13 AM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్‌ఎస్‌ ధోనీ హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎస్‌ అధికారి జీ సంపత్‌కు వ్యతిరేకంగా ధోనీ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్ పిఎన్ ప్రకాష్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందుకు కేసు విచారణకు వచ్చింది. అయితే శుక్రవారం ఈ కేసుపై విచారణ జరగలేదు. 2014 లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ధోనిపై ఐపీఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలపై ధోని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

2014లో అప్పటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉన్న సంపత్‌ కుమార్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, మ్యాచ్‌ల స్పాట్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా శాశ్వతంగా నిలువరించాలని ధోనీ సివిల్ దావా వేశారు. దీంతో 2014 మార్చి 18న ధోనీకి వ్యతిరేకంగా సంపత్‌ కుమార్‌ ఎలాంటి ప్రకటన చేయకూడదని కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కోర్టు ఉత్తర్వులన్నప్పటికీ సంపత్‌ కుమార్‌ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

తనపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసినందుకు గాను అధికారితో పాటు జీ మీడియా కార్పొరేషన్‌ నుంచి రూ. 100 కోట్ల నష్ట పరిహారం కొరుతూ ధోనీ పిటిషన్‌ దాఖలు చేశారు. అతను దాఖలు చేసిన డిసెంబర్ 17, 2021 నాటి అదనపు రాతపూర్వక ప్రకటనలో, సంపత్ కుమార్ అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టుకు వ్యతిరేకంగా అపకీర్తి కలిగించే ప్రకటనలు చేశాడని ధోని ఆరోపించాడు. ఇదిలా ఉంటే ధోనీ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..