T20 World Cup: భారత్, పాకిస్థాన్ ఫైన‌ల్‌లో తలపడే ఛాన్సులు ఉన్నాయా..? సడెన్‌గా రేసులోకి దూసుకొచ్చిన పాక్

టీ-ట్వంటీ వరల్డ్ కప్ యమా రంజుగా సాగుతోంది. ఆసీస్ లో వర్షాలు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నా.. అవి కూడా ఫలితాలను తారు మారు చేస్తూ.. మరింత సస్పెన్స్ పెంచుతున్నాయ్. ఇంతకీ ఇండియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్ ల్లో సెమీస్ చేరేదెవరు? పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం పఠిష్టంగా ఉన్నా.. ఇవాళ రేపు జరగనున్న మ్యాచ్ ల ప్రకారం.. సెమీస్ లోకి దూసుకెళ్లేదెవరు? చతికిల పడేది ఎవరు? మన టీమిండియా అవకాశాల శాతమెంత?

T20 World Cup: భారత్, పాకిస్థాన్ ఫైన‌ల్‌లో తలపడే ఛాన్సులు ఉన్నాయా..? సడెన్‌గా రేసులోకి దూసుకొచ్చిన పాక్
India Vs Pakistan
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 05, 2022 | 8:51 AM

టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా మారింది. మాములుగా అయితే.. టీమిండియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిపోయి, బంగ్లాదేశ్‌పై గెలవడంతో పాకిస్థాన్‌కు సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అనుకున్నారు. కానీ ఆ టీమ్‌ నెదర్లాండ్స్‌తోపాటు పటిష్ఠమైన సౌతాఫ్రికా టీమ్‌ను కూడా ఓడించి మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. దీంతో ప్రెజంట్ ఇండియా, పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలలో సెమీస్‌ చేరే టీమ్స్‌ ఏవి అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఒక రకంగా పాకిస్థాన్‌తో పోలిస్తే ఇప్పటికీ ఇండియా, సౌతాఫ్రికాలకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రూప్‌- 2లో ఇండియా 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి టాప్‌లో ఉంది. ఇక సౌతాఫ్రికా 4 మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికాపై గెలిచిన పాకిస్థాన్‌- 4 పాయింట్లతో మూడోస్థానానికి వచ్చింది.

బేసిగ్గా ఇండియా తన చివరి మ్యాచ్‌ ఆరో తేదీన జింబాబ్వేతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా గ్రూప్‌ 2లో టాప్‌లో నిలిచి నేరుగా సెమీస్‌ చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం కష్టమే. అటు సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడితేనే ఇండియాకు ఛాన్సుంటుంది. లేకుంటే పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ విజయం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియా కంటే పాకిస్థాన్‌ నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. అందువల్ల ఇండియా ఓడిపోయి, పాకిస్థాన్‌ గెలిస్తే చాలు.. ఆ టీమ్‌ సెమీస్‌ చేరుతుంది. ఒకవేళ జింబాబ్వేతో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా ఇండియా సెమీస్‌ వెళ్తుంది. ఏడు పాయింట్లు అందుకునే అవకాశం ఇటు పాకిస్థాన్‌కుగానీ, అటు బంగ్లాదేశ్‌కుగానీ లేదు. ఒకవేళ గ్రూప్-2 నుంచి ఇండియా, పాక్ టీమ్స్ సెమీఫైనల్‌కు చేరుకుంటే.. గ్రూప్-1లో టాప్-2 ర్యాంకుల్లో ఉన్న టీమ్స్‌తో పోటీపడతాయి. అప్పుడు, నవంబర్ 13న మెల్ బోర్న్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్‌లు తలపడే ఛాన్స్ ఉంటుంది.

ప్రస్తుతం సౌతాఫ్రికా ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. ఆ టీమ్‌ చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై గెలిస్తే చాలు సెమీస్‌ వెళ్తుంది. ఒకవేళ ఇటు నెదర్లాండ్స్‌ చేతుల్లో ఓడి, అటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ఫలితం వస్తే చాలు.. సౌతాఫ్రికా ఇంటికెళ్లిపోతుంది. ఇక వర్షం కారణంగా రద్దయితే మాత్రం నెట్‌ రన్‌రేట్‌ అత్యంత కీలకమవుతుంది. పాకిస్థాన్ సెమీస్‌ చేరాలంటే చివరి మ్యాచ్‌లో కచ్చితంగా బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అదే సమయంలో నెదర్లాండ్స్‌ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోవడం లేదా మ్యాచ్ రద్దవడం జరగాలి. లేదంటే జింబాబ్వే చేతుల్లో ఇండియా ఓడిపోయినా పాక్‌ సెమీస్‌ వెళ్తుంది. ఇండియా కంటే పాక్ నెట్‌ రన్‌రేట్‌ చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి ఇదే కీ ఫ్యాక్టర్ గా మారనుంది.

బంగ్లాదేశ్‌ కూడా సాంకేతికంగా సెమీస్‌ రేసులో ఉన్నా కూడా చాలా తక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ టీమ్‌ నెట్‌ రన్‌రేట్‌ చాలా తక్కువగా ఉంది. చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచి, అటు నెదర్లాండ్స్‌ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోతే ఛాన్సుంటుంది. ఒకవేళ పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ గెలిచి, జింబాబ్వే చేతుల్లో టీమిండియా ఓడినా.. ఇండియానే సెమీస్‌ చేరుతుంది. బంగ్లా కంటే ఇండియా నెట్‌ రన్‌రేట్‌ చాలా మెరుగ్గా ఉంది కాబట్టి.

ఆఖరుగా.. జింబాంబ్వే పై ఇండియా విజయావకాశాలు ఒకింత బలంగానే ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన టీ20 గణాంకాలను పరిశీలిస్తే ఇండియా- జింబాంబ్వే మధ్య ఏడు మ్యాచ్ లు జరగ్గా.. వీటిలో ఐదింటిని ఇండియా గెలవగా.. రెండింటిలో మాత్రమే జింబాంబ్వే గెలిచింది. అయితే.. జింబాంబ్వే- పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ గల పాకిస్థాన్ ను ఇదే వరల్డ్ కప్ లో ఓడించింది. దీని ప్రకారం చూస్తే జింబాంబ్వేతో ఒకింత జాగ్రత్తగానే ఉండాలంటున్నారు క్రికెట్ పండితులు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!