AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Virat Kohli: కోహ్లీ ముద్దుపేరేంటో తెలుసా? మాజీ సారథికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు ఇవే..

10 Interesting Facts about Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఈరోజు 34వ ఏట అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లీ కెరీర్‌కి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను ఓసారి చూద్దాం..

Happy Birthday Virat Kohli: కోహ్లీ ముద్దుపేరేంటో తెలుసా? మాజీ సారథికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు ఇవే..
Virat Kohli Birthday Special
Venkata Chari
|

Updated on: Nov 05, 2022 | 8:32 AM

Share

కింగ్ కోహ్లిగా పేరుంగాచిన విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచాడు. మైదానం ఏదైనా సరే పరుగుల వరద పారించడంలో రన్ మెషీన్ తర్వాతే ఎవరైనా అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. భారత్ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లి టీమ్ ఇండియా కెప్టెన్‌గా లేడు. కెప్టెన్ కిరీటం లేకపోయినా, అతను ఒక టాప్ ప్లేయర్ నుంచి ఆశించాల్సిన అన్ని క్వాలిటీస్‌తో ఫ్యాన్స్‌ను సంతోషపెడుతున్నాడు. మూడేళ్లుగా తన పేలవ ఫాంతో ఇబ్బంది పడిన కోహ్లీ.. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులనే కాదు.. టీమిండియా అభిమానులకు కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలాగే ఛేజింగ్ మాస్టర్ అవతారాన్ని మరోసారి తనకే ఎందుకు సొంతమో నిరూపించాడు.

ప్రస్తుత T20 ప్రపంచ కప్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలవడం గమనార్హం. అతను పాకిస్థాన్‌పై అజేయంగా 82, నెదర్లాండ్స్‌పై అజేయంగా 62, దక్షిణాఫ్రికాపై 12 నాటౌట్, ఆపై బంగ్లాదేశ్‌పై అజేయంగా 64 పరుగులతో సూపర్ ఫాంతో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం విరాట్ తన పాత స్టైల్‌లోనే ఆడుతున్నాడు. ఈ స్పెషల్ ప్లేయర్ కెరీర్‌కి సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలను అతని పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం.

1. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించాడు. అతని తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ, తల్లి పేరు సరోజ్. అతనికి ఒక సోదరుడు వికాస్, సోదరి భావనా ​​కోహ్లీ ఉన్నారు. విరాట్‌ను చీకు అని కూడా ముద్దుగా పిలిచేవారు.

2. విరాట్ కోహ్లీ ఢిల్లీలో కోచ్ రాజ్‌కుమార్ శర్మ నుంచి క్రికెట్ నేర్చుకోవడం ప్రారంభించాడు. పశ్చిమ ఢిల్లీలోని క్రికెట్ అకాడమీలో ఆటలో తన ప్రారంభ పాఠాలను నేర్చుకున్నాడు. అన్ని స్థాయిలలో క్రికెట్ ఆడుతూ, అతను భారత అండర్-19 జట్టుకు చేరుకున్నాడు. అండర్-19 ప్రపంచ కప్ 2008లో విజేతగా నిలిచిన తర్వాత తిరిగి చూసుకోలేదు.

3. క్రికెట్‌లో విరాట్ కోహ్లికి స్ఫూర్తి గొప్ప మాజీ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. అతను దీని గురించి చాలాసార్లు చెప్పాడు. తరువాత అతను సచిన్‌తో ఆడే అవకాశం మాత్రమే కాకుండా, అతని సమక్షంలో సచిన్ తన మొదటి ప్రపంచ కప్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నాడు.

4. విరాట్ కోహ్లీ 2008లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌గా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతని బ్యాట్‌ నుంచి కేవలం 12 పరుగులు మాత్రమే వచ్చాయి. సచిన్, సెహ్వాగ్ లేకపోవడంతో ఆ రోజు విరాట్‌కు ఆడే అవకాశం లభించింది.

5. అంతర్జాతీయ క్రికెట్ పేరిట విరాట్ కోహ్లికి ఎన్నో పెద్ద రికార్డులు ఉన్నాయి. అత్యంత వేగంగా 8000, 9000, 10000, 11000, 12000 వన్డే పరుగులు లేదా వన్డేలలో 43 సెంచరీల రికార్డు నెలకొల్పాడు. సచిన్ తర్వాత రెండవదిగా నిలిచింది. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 71 సెంచరీలు సాధించాడు.

6. 2013లో ఆస్ట్రేలియాపై 2013లో వన్డే క్రికెట్‌లో భారత్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

7. కెప్టెన్‌గా, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచంలోని మరే కెప్టెన్ చేయలేకపోవడం గమనార్హం. ఇది కాకుండా, భారతదేశానికి 27 టెస్టు విజయాలు అందించిన ఏకైక భారత టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు.

8. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా విరాట్ పేరిటే నెలకొంది. 2010 నుంచి 113 మ్యాచ్‌లలో 3932 పరుగులతో దూసుకపోతున్నాడు.

9. అవార్డుల గురించి మాట్లాడితే, విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అర్జున అవార్డు, పద్మశ్రీ, ఖేల్ రత్నలను గెలుచుకున్నాడు. ఇది కాకుండా, అతను మూడుసార్లు ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, రెండుసార్లు ICC క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు (2011-2020), విస్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు.

10. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ డిసెంబర్ 11, 2017న ఇటలీలో నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారికి వామిక అనే కుమార్తె ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..