Rishab Shetty: మిస్టర్‌ 360ని కలిసిన రిషబ్.. కాంతారా అంటూ రచ్చ చేసిన స్టార్స్‌.. అదిరిపోయిన వీడియో

ఇదిలా ఉంటే సినిమా ప్రమోట్‌ చేయడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాలు చుట్టేస్తున్నాడు హీరో రిషబ్‌. ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్‌, మిస్టర్‌ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ను కలుసుకున్నాడు రిషబ్‌.

Rishab Shetty: మిస్టర్‌ 360ని కలిసిన రిషబ్..  కాంతారా అంటూ రచ్చ చేసిన స్టార్స్‌.. అదిరిపోయిన వీడియో
Rishab Shetty, Ab De Villie
Follow us

|

Updated on: Nov 04, 2022 | 9:48 PM

కాంతారో సినిమాతో ఓవర్‌నైట్‌లో  సెలబ్రిటీగా మారిపోయాడు హీరో రిషబ్‌శెట్టి. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు అతనే దర్శకత్వం వహించడం విశేషం. ఈ మూవీ గ్రాండ్‌ సక్సెస్‌తో రిషబ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. తెలుగులోనూ ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోట్‌ చేయడంలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాలు చుట్టేస్తున్నాడు హీరో రిషబ్‌. ఇటీవల రజనీకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్‌, మిస్టర్‌ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌ను కలుసుకున్నాడు రిషబ్‌. బెంగళూరులో వీరిద్దరూ కలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రిషబ్ శెట్టి తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందులో దక్షిణాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, రిషబ్ కలిసి కాంతార అంటూ గట్టిగా అరుస్తూ కనిపించారు. ‘ఇది ఒక మ్యాచ్! ఈ రోజు నిజమైన 360ని కలుసుకున్నాను. మా బెంగళూరుకు మళ్లీ తిరిగి వచ్చాడు’ అని ఈ పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చాడు రిషబ్‌.

కాగా 2020 సీజన్ తర్వాత ఐపీఎల్‌తో సహా అన్ని రకాల క్రికెట్లకు డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను ఏదో విధంగా ఆర్సీబీతో ఉండాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల బెంగళూరుకు వచ్చాడు. ఇదే క్రమంలో రిషబ్‌ డివిలియర్స్‌ను కలిశాడని తెలుస్తోంది. ఇక వీరిద్దరి సమావేశంపై అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. టూస్టార్స్‌ ఇన్‌ వన్‌ ఫ్రేమ్‌.. ఇద్దరు లెజెండ్స్‌ అంటూ రియాక్షన్లతో కామెంట్లు పెడుతున్నారు. కాగా విడుదలై నెలరోజులు గడిచినా బాక్సాఫీస్‌ వద్ద కాంతారా జోరు ఆగడం లేదు. ఇప్పటికే కన్నడ నాట రూ.200కు కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. కిషోర్ కుమార్, ప్రమోద్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
'గీతాంజలి అలాంటి అమ్మాయి'.. రష్మిక రియాక్షన్..
'గీతాంజలి అలాంటి అమ్మాయి'.. రష్మిక రియాక్షన్..
రియల్‌మీ నుంచి సూపర్‌ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్..
రియల్‌మీ నుంచి సూపర్‌ స్మార్ట్ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్..
మౌనికతో లవ్‌లో పడ్డాకే ఫ్యాన్స్‌ ప్రేమ విలువ తెలిసొచ్చింది: మనోజ్
మౌనికతో లవ్‌లో పడ్డాకే ఫ్యాన్స్‌ ప్రేమ విలువ తెలిసొచ్చింది: మనోజ్
ఆ రెండు కార్లపై అదిరిపడే డిస్కౌంట్లను ప్రకటించిన మహీంద్రా
ఆ రెండు కార్లపై అదిరిపడే డిస్కౌంట్లను ప్రకటించిన మహీంద్రా
TSGENCO రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
TSGENCO రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదల