దేవీశ్రీ ప్రసాద్ మూవీని షూటింగ్ అడ్డుకుంటాం.. బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వార్నింగ్
దేవిశ్రీ ప్రసాద్ పై కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తోపాటు పలు హిందు సంఘాలు కూడా దేవీశ్రీ పై ఫిర్యాదు చేశాయి.
ఒక్క పాట.. ఒక ఒక్క ఇప్పుడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ను ముప్పుతిప్పలు పెడుతోంది. దేవీ ప్రసాద్ తాజాగా రిలీజ్ చేసిన.. హరేరామ సాంగ్‌లో హిందూ దేవుడైన శ్రీకృష్ణుడిని అవమానించారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నటి కరాటే కళ్యాణి. దేవిశ్రీ ప్రసాద్ పై కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. ఆమె తోపాటు పలు హిందు సంఘాలు కూడా దేవీశ్రీ పై ఫిర్యాదు చేశాయి. దానికి కారణం ఏంటంటే దేవి శ్రీ కంపోజ్ చేసిన ఓ పారి అనే ఆల్బమ్ లో హరే రామ , హరే కృష్ణ మంత్రాన్నివాడారు. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో హరే రామ హరే కృష మంత్రం ఎలా వాడుతారని దేవీ పై కంప్లెయింట్ చేశారు ఆమె . ఇక వెంటనే ఆ పాటలోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకుడు విష్ణు వర్దన్ రెడ్డి. దాంతో పాటే హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు దేవీని.. సారీ చెప్పాలన్నారు. హిందూ దేవతలను తరచూ అవమానించడం చిత్ర పరిశ్రమలో కొందరికి అలవాటుగా మారిందంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా దేవీశ్రీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు. దేవి శ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో అతను ఏ మూవీలో అయితే మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాడో ఆ మూవీని అడ్డుకొని తీరుతాము అలాగే అతను ఆఫీస్ ను కూడా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. మీడియా ద్వారా అతనిపై ఇప్పటికే చాలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతన్ని ఏ మూవీలైనా మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటే ఆ మూవీని షూటింగ్ అడ్డుకుంటాము , సినిమాను కూడా బాయ్ కాట్ చేసి తీరుతాం. హరే రామ హరే కృష్ణ నామాన్ని అశ్లీలంగా చిత్రీకరించినందుకు అతనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి. లేకుంటే మధ్యప్రదేశ్ లో షూటింగ్ పై దాడి జరిగినట్టుగా దాడి చేసి తీరుతాం అంటూ హెచ్చరించారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..